PAKISTAN SECURITY POLICY SEEKS 100 YEARS OF PEACE WITH INDIA HERE IS KEY DETAILS SK
India-Pakistan: పాకిస్తాన్ శాంతిమంత్రం.. భారత్‌తో దోస్తీకి తహతహ.. అసలు స్కెచ్ ఇదేనా?
ప్రతీకాత్మక చిత్రం
India-Pakistan: భారత్‌తో దోస్తీకి పాకిస్తాన్ ముందుకొస్తోంది. వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలని భావిస్తోంది. శాంతిమంత్రం జపిస్తూ.. భారత్ సాయం కోసం ఎదురుచూస్తోంది.
భారత్‌పై విషం గక్కేందుకే పాకిస్తాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. వీలుచిక్కినప్పుడల్లా అంతర్జాతీయ వేదికపై ఇండియాపై బురద జల్లే ప్రయత్నమే చేస్తుంది. అంతేకాదు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కాశ్మీర్లో కల్లోలం సృష్టిస్తుంది. ఎల్వోసీ వెంబడి కాల్పులు జరుపుతూ భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తుంది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్‌తో దోస్తీకి ముందుకొస్తోంది. వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలని భావిస్తోంది. శాంతిమంత్రం జపిస్తూ.. భారత్ సాయం కోసం ఎదురుచూస్తోంది. భారత్ సహా పొరుగు దేశాలన్నింటితోనూ శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని పాకిస్తాన్ తెలిపింది. పాక్ మొట్టమొదటిసారిగా రూపొందించిన జాతీయ భద్రత విధాన పత్రం- 2022-26లో ఈ విషయాన్ని వెల్లడించింది.
భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి కనిపిస్తే... కాశ్మీర్ సమస్యతో నిమిత్తం లేకుండా వాణిజ్య వృద్ధికి చొరవ తీసుకొంటామని పాకిస్తాన్ పేర్కొంది. గత నెలలో పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదించిన జాతీయ భద్రత విధానాన్ని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. అందులో కొంత భాగాన్ని మాత్రమే ప్రస్తుతానికి బహిరంగపరుస్తామని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. పాకిస్థాన్‌కు ఇప్పటికే రక్షణ, అంతర్గత భద్రత, విదేశాంగ విధానాలు ఉన్నాయనీ.. వీటన్నింటినీ జాతీయ భద్రత విధానం కిందకు తీసుకొస్తున్నామని వివరించారు. రాబోయే వందేళ్ల వరకు కూడా భారత్‌తో తాము శత్రుత్వం కోరుకోవడం లేదనీ.. ఇరుగుపొరుగుతో సఖ్యత ఆశిస్తున్నామని తెలిపారు. ఐతే భారత్‌లో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు... రెండు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని తాము భావించడ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్‌లో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్.. ఇప్పుడు దోస్తీకి ప్రయత్నించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. వాస్తవానికి ఇండియా, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ కాశ్మీర్లో ఆర్టికల్ 371 రద్దు చేసిన తర్వాత ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు పుల్వామా ఉగ్రదాడి, భారత్ సర్జికల్ స్ట్రైక్స్ వంటి పరిణామాల తర్వాత శత్రుత్వం పెరిగింది. ఈ క్రమంలోనే వాణిజ్య బంధం తెగిపోయింది. మనదేశ ఉత్పత్తులు అక్కడికి వెళ్లడం లేదు. అక్కడి ఉత్పత్తులు ఇక్కడికి రావడం లేదు. పాకిస్తాన్ ఉత్పత్తులు భారత్‌కు రాకపోవడం వల్ల మనకు పెద్దగా ఇబ్బంది లేదు గానీ..మన వస్తువులు అక్కడికి వెళ్లపోవడం వల్ల పాకిస్తానీయులపై తీవ్ర ప్రభావం పడింది. దిగుమతులు ఆగిపోవడంతో.. ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడింది. నిత్యావసర ధరలు చుక్కలను తాకాయి.
అంతేకాదు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగాలేదు. దాదాపు దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంతగా దిగజారింది. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశాలతో సఖ్యతకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వాణిజ్య సంబంధాల ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌తో దోస్తికి తాము సిద్ధమని స్నేహ హస్తం అందిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.