• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PAKISTAN REGISTERS FIR AGAINST IAF PILOTS FOR BOMBING 19 TREES IN BALAKOT BA

భారత ఎయిర్‌ఫోర్స్ మీద వెరైటీ కేసు పెట్టిన పాకిస్తాన్

భారత ఎయిర్‌ఫోర్స్ మీద వెరైటీ కేసు పెట్టిన పాకిస్తాన్

భారత యుద్ధ విమానాలు (File)

‘కొందరు గుర్తు తెలియని పైలెట్లు బాలాకోట్‌లో చెట్ల మీద బాంబులు వేశారు’ అని ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

  • Share this:
    ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మీద పాకిస్తాన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారత వాయుసేనకు చెందిన విమానాలు పాకిస్తాన్‌లోకి వచ్చి చెట్ల మీద బాంబులు వేశాయని, 19 చెట్లు నాశనం అయ్యాయంటూ కేసు నమోదైంది. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంప్ మీద భారత వాయుసేన ఎయిర్‌స్ట్రైక్ చేసింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున బాలాకోట్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో బాంబులు వేశారు. ‘కొందరు గుర్తు తెలియని పైలెట్లు బాలాకోట్‌లో చెట్ల మీద బాంబులు వేశారు’ అని ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మీద ఒత్తిడి పెంచేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. అంతర్జాతీయంగా ప్రెజర్ పెంచుతోంది. అయితే, మరోవైపు పాకిస్తాన్ భారత్‌ను సరైన మార్గంలో ఢీకొట్టకుండా భారత్ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందంటూ అడ్డదారిలో వాదిస్తోంది.
    First published: