జమ్ముకశ్మీర్‌లో దేశ నియంత్రణ రేఖ వెంబడి భారత సేనలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన పాకిస్థాన్‌కు చెందిన నిఘా క్వాడ్ కాప్టర్(Quadcopter) ను భారత ఆర్మీ కూల్చి వేసింది. శనివారంనాడు నియంత్రణ రేఖ(LOC) ను దాటి జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో కెరాన్ సెక్టార్‌లోకి పాకిస్థాన్ ఆర్మీకి చెందిన నిఘా క్వాడ్ కాప్టర్ చొచ్చుకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భారత దళాలు దాన్ని కూల్చి వేసినట్లు భారత ఆర్మీ అధాకారులు తెలిపారు. ఈ క్వాడ్ కాప్టర్ చైనాలో తయారైనదిగా భారత ఆర్మీ అధికారులు నిర్థారించారు. దీంతో భారత్‌ను దెబ్బతీసేందుకు పాక్ ఆర్మీకి చైనా సాంకేతిక సాయాన్ని అందిస్తున్న విషయం మరోసారి రూడీ అయ్యింది.
తూర్పు లద్ధఖ్‌లో చైనా నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో...ఇటు జమ్ముకశ్మీర్ సరిహద్దులోనే భారత సేనలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. పాక్ తీవ్రవాదుల చొరబాటు యత్నాలను, పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. పాక్ ఆర్మీ అండదండలతో భారత్‌లోకి చొరబడేందుకు తీవ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటోంది. తీవ్ర శీతల పరిస్థితులు ప్రారంభానికి ముందుగా భారీ సంఖ్యలో తీవ్రవాదులను భారత్‌లో చొరబడేందుకు విఫలయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత భూభాగంలో నిఘా కోసం పంపిన క్వాడ్ కాప్టర్‌ను భారత సేనలు చాకచక్యంగా గుర్తించి కూల్చివేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Army, Jammu and Kashmir, Pakistan