హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ajit Doval: అజిత్ దోవల్ ఇంటి వద్ద ఉగ్రవాదుల రెక్కీ.. సంచలన విషయాలు

Ajit Doval: అజిత్ దోవల్ ఇంటి వద్ద ఉగ్రవాదుల రెక్కీ.. సంచలన విషయాలు

అజిత్ దోవల్

అజిత్ దోవల్

ఉగ్రవాదుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను రెండేళ్ల క్రితమే శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చానని మాలిక్ తెలిపాడు. 2019 మే 25న పలు కీలకమైన కార్యాలయాలు వీడియో తీశానని.. అందులో అజిత్ దోవల్ ఆఫీసు కూడా ఉందని చెప్పినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...

అజిత్ దోవల్.. జాతీయ భద్రతా సలహాదారుడు. మన దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి. దేశంలో అల్లర్లను అణచాలన్న, దేశం బయట ఉగ్రమూకలను ఏరివేయాలన్నా.. అజిత్ దోవల్ దిగాల్సిందే. 2016 యూరీ సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్‌ ఎయిర్ స్ట్రైక్స్ వెనక అజిత్ దోవల్‌ కీలక భూమిక పోషించారు. అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అజిత్ దోవల్ పర్యటించి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అలాంటి ఆఫీసర్‌ను పాకిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఢిల్లీలో అజిత్ దోవల్ నివాసంతో పాటు కార్యాలయం వద్ద పలు మార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. జైషే మోహమ్మద్ ఉగ్రవాది విచాణలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఫిబ్రవరి 6న జైషే మొహమ్మద్ (JeM) ఉగ్రవాది హిదాయత్ ఉల్లా మాలిక్‌ను అనంత్‌నాగ్‌లో జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జైషే అనుబంధ సంస్థ లష్కరే ముస్తఫాకు ఇతడే హెడ్. హిదాయత్ ఉల్లా మాలిక్ స్వస్థలం షోపియన్‌. అతడిపై జమ్మూలోని గంగ్యాల్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 18 మరియు 20 UAP Act కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాలిక్‌తో పాటు అతడి భార్య, ఛండీగడ్‌కు చెందిన విద్యార్థి, బీహార్‌కు చెందిన ఒక వ్యక్తిని కూడా ప్రశ్నించారు.

ఐతే వీరి విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను రెండేళ్ల క్రితమే శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చానని మాలిక్ తెలిపాడు. 2019 మే 25న పలు కీలకమైన కార్యాలయాలు వీడియో తీశానని.. అందులో అజిత్ దోవల్ ఆఫీసు, నివాసం కూడా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని వాట్సప్ ద్వారా పాకిస్తాన్‌కు చేరవేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తిరిగి బస్సులో కశ్మీర్‌కు వెళ్లానని చెప్పాడు. పుల్వామా ఉగ్రదాడి కేసులో అరెస్టైన ఉగ్రవాది సమీర్‌ అహ్మద్‌ దార్‌తో కలిసి సాంబా సెక్టర్‌లోని సరిహద్దు ప్రాంత్రాన్ని కూడా వీడియో తీసినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు. ఆ వివరాలను జమ్మూకాశ్మీర్ పోలీసులు కేంద్రానికి అందజేశారు.

ఉగ్రవాది మాలిక్ ఇంటరాగేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఢిల్లీలో అజిత్ దోవల్ నివాసంతో పాటు పలు భద్రతా సంస్థల కార్యాలయాలకు భద్రత పెంచింది. కాగా, మాలిక్ గతంలో చేసిన పలు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను తెలిపాడు. 2020 మేలో సూసైడ్ బాంబ్ అటాక్ కోసం హుందయ్ శాంత్రో కారును పాకిస్తాన్ ఉగ్రవాదులు అందజేశారు. జైషే ఉగ్రవాదులు ఇర్ఫాన్ తోకర్, ఉమర్ ముస్తాఖ్, రయీస్ ముస్తఫాతో కలిసి 2020 నవంబరులో జేకే బ్యాంక్ క్యాష్ వ్యాన్ నుంచి రూ.60 లక్షలు చోరీ చేసినట్లు తెలిపాడు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

First published:

Tags: Ajit Doval, Jammu and Kashmir, Terrorists

ఉత్తమ కథలు