పాకిస్తాన్ ఓవరాక్షన్.. ప్రధాని మోదీ విమానానికి మళ్లీ నో ఎంట్రీ

కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. అందుకే మోదీ విమానానికి అనుమతి నిరాకరిస్తునట్లు పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఓ ప్రకటనలో తెలిపారు.

news18-telugu
Updated: October 27, 2019, 6:12 PM IST
పాకిస్తాన్ ఓవరాక్షన్..  ప్రధాని మోదీ విమానానికి మళ్లీ నో ఎంట్రీ
ప్రధాని మోదీ
  • Share this:
బాలాకోట్ వైమానిక దాడులు, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి పరిణామాలతో భారత్-పాకిస్తాన్ మధ్య బంధాలు తెగిపోయాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశం మరోసారి తమ వక్ర బుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ విమాన వెళ్లేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. మోదీ సౌదీ అరేబియా పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. అందుకే మోదీ విమానానికి అనుమతి నిరాకరిస్తునట్లు పాకిస్తాన్ విదేశాంగమంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఓ ప్రకటనలో తెలిపారు.

సోమవారం సౌదీ అరేబియా పర్యటకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ బిజినెస్ ఫోరంలో పాల్గొంటారు. అనంతరం సౌదీ నేతలతోనూ సమావేశమై ఇరుదేశ సంబంధాలపై చర్చిస్తారు. కాగా, ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పటి నుంచి భారత్ వైపు నుంచి వెళ్లే విమానాలకు అనుమతి నిరాకరిస్తోంది పాకిస్తాన్. ఇటీవల మోదీ అమెరికా పర్యటన, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ ఐస్‌లాండ్ పర్యటనల సమయంలోనూ తమ గగనతలంలో భారత విమానాలకు అనుమతి ఇవ్వలేదు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఎల్‌వోసీ వెంబడి చెలరేగుతూనే..భారత్‌ను రెచ్చగొడుతోంది. అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టేందుకు ఎన్నోసార్లు కుట్రలు చేసి విఫలమైంది. ఇదే క్రమంలో భారత్‌తో సంబంధాలను ఒక్కొక్కటిగా తెంచుకుంటోంది. ఇప్పటికే సంఝౌతా, థార్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసిన పాక్.. లాహోర్-ఢిల్లీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది. అంతేకాదు పాక్ గగనతలాన్ని భారత్‌కు శాశ్వతంగా మూసివేయాలని భావిస్తోంది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.
Published by: Shiva Kumar Addula
First published: October 27, 2019, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading