పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై విదేశాంగమంత్రి కీలక వ్యాఖ్యలు

కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామన్న ఆయన.. ఇది ఉగ్రవాదానికి సంబంధించిన అంశం కాదని చెప్పారు.

news18-telugu
Updated: September 17, 2019, 10:13 PM IST
పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై విదేశాంగమంత్రి కీలక వ్యాఖ్యలు
విదేశాంగ మంత్రి జయశంకర్
news18-telugu
Updated: September 17, 2019, 10:13 PM IST
పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని కేంద్ర విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అధికారికంగా భారత్‌లో కలిసే రోజు ఖచ్చితంగా వస్తుందని విదేశాంగమంత్రి జైశంకర్ తేల్చిచెప్పారు. ప్రధాని వంద రోజుల పాలనపై మీడియాతో మాట్లాడిన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేశామన్న ఆయన.. ఇది ఉగ్రవాదానికి సంబంధించిన అంశం కాదని చెప్పారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను ప్రపంచ దేశాలు గ్రహిస్తున్నాయని పేర్కొన్నారు.

పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య.. ఆర్టికల్370 కాదు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం. ప్రపంచంలో పొరుగు దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశం ఒక్క పాకిస్తాన్ మాత్రమే. పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే. పీవోకేపై భారత్ అధికారికంగా నిర్ణయాలు తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది.
జైశంకర్
ఇక అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయన్నారు జయశంకర్. కొన్ని సమస్యలున్నా.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...