పాకిస్తాన్ జలాల్లోకి భారత జలాంతర్గామి? ఖండించిన ఇండియన్ నేవీ

ప్రతీకాత్మక చిత్రం

భారత నేవీ వర్గాలు మాత్రం పాకిస్తాన్ ప్రకటనను ఖండిస్తున్నాయి. వీడియో ప్రామాణికతను నిర్ధారిస్తున్నామని...ప్రాథమిక పరిశీల ప్రకారం అది పాత వీడియోగా అనిపిస్తోందని వెల్లడించారు. పాత వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పినట్లు సమాచారం

 • Share this:
  భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర తగ్గినప్పటికీ...టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. ఎల్‌వోసీ వెంబడి పాకిస్తాన్ రేంజర్లు చెలరేగిపోతున్నారు. భారత్ సైనిక స్థావరాలు, పౌరులను టార్గెట్ చేసుకొని కాల్పులు జరుపుతున్నారు. సోమవారం పాకిస్తాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ను రాజస్థాన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు కుప్పకూల్చాయి. ఐతే తాజాగా అరేబియా సముద్రంలో తీవ్ర కలకలం రేగినట్లు సమాచారం. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గామి తమ జలాల్లోకి ప్రవేశించిందని పాకిస్తాన్ నేవీ ప్రకటించింది. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది.

  పాకిస్తాన్ జలాల్లోకి ఇండియన్ సబ్ మెరైన్ ప్రవేశించడంతో అడ్డుకున్నాం. శాంతి నీతి దృష్ట్యా ఆ జలాంతర్గామిపై మేం దాడి చేయలేదు. మా ప్రాదేశిక జలాల్లో కాపలాకు పాకిస్తాన్ నేవీ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఎలాంటి దురాక్రమణలు జరిగినా తిప్పికొట్టే సామర్థ్యముంది. 2016 నవంబరు తర్వాత భారత జలాంతర్గామి పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడం ఇది రెండోసారి.
  పాకిస్తాన్ నేవీ అధికార ప్రతినిధి
  దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా పాకిస్తాన్ నేవీ రిలీజ్ చేసింది. ఆ దృశ్యాలను పాకిస్తానీ మీడియా ప్రసారం చేసింది. తమ ప్రాదేశిక జలాల్లో భారత్ దురాక్రమణకు ప్రయత్నించిందని కథనాలు ప్రసారం చేశాయి. ఐతే భారత నేవీ వర్గాలు మాత్రం పాకిస్తాన్ ప్రకటనను ఖండిస్తున్నారు. వీడియో ప్రామాణికతను నిర్ధారిస్తున్నామని...ప్రాథమిక పరిశీల ప్రకారం అది పాత వీడియోగా అనిపిస్తోందని వెల్లడించారు. పాత వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పినట్లు సమాచారం.

  కాగా, సోమవారం ఉదయం రాజస్థాన్ సరిహద్దులో భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్ ప్రవేశించింది. అప్రమత్తమైన భారత వాయుసేన ఆ డ్రోన్‌ని కూల్చేసింది. సుఖోయ్ 30MKI యుద్ధ విమానంతో పాకిస్తాన్ UAV (మానవరహిత వాయు వాహనం)కి కూల్చినట్లు ANI వార్తాసంస్థ వెల్లడించింది. బీకనేర్ నాల్ సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది. కూలిపోయిన్ డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  First published: