Home /News /national /

Pakistan national : మానవత్వం చాటుకున్న భారత్ -బోర్డర్ దాటి వచ్చిన పాకిస్తానీని ఇలా..

Pakistan national : మానవత్వం చాటుకున్న భారత్ -బోర్డర్ దాటి వచ్చిన పాకిస్తానీని ఇలా..

బోర్డర్ దాటొచ్చిన యువకుడిని తిరిగి పంపుతోన్న బీఎస్ఎఫ్

బోర్డర్ దాటొచ్చిన యువకుడిని తిరిగి పంపుతోన్న బీఎస్ఎఫ్

భారత్, పాకిస్తాన్ మధ్య పంజాబ్ లో గల అంతర్జాతీయ సరిహద్దు వద్ద సుహృద్భావ దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా ఇలాంటివే పాకిస్తాన్ వైపు జరిగితే మనోళ్లను ముక్కలు చేసిన సందర్భాలున్నాయి. కానీ భారత్ సైతం పాక్ మాదిరి కిరాతకానికి పాల్పడకుండా ..

ఇంకా చదవండి ...
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదంటూనే తరచూ భారత్ పోస్టులపైకి, గ్రామాలపైకి బుల్లెట్ల వర్షం కురిపించే పాకిస్తాన్ (Pakistan) తాజాగా రూటు మార్చి డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తోంది. సరిహద్దు వెంబడి పాక్ డ్రోన్లు కలకలం సృష్టిస్తోన్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. సరిహద్దులో భారత్ కూడా డ్రోన్లను వాడుతున్నప్పటికీ వాటిని కొవిడ్ (Covid) వ్యాక్సిన్లు చేరవేయడానికే వినియోగిస్తున్నది. రెండు దేశాల మధ్య శతృత్వం నేపథ్యంలో భారత్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఘటన తాజాగా పంజాబ్ సరిహద్దులో చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటివే పాకిస్తాన్ వైపు జరిగితే మనోళ్లను ముక్కలు చేసిన సందర్భాలున్నాయి. కానీ భారత్ సైతం పాక్ మాదిరి కిరాతకానికి పాల్పడకుండా హుందాతనాన్ని ప్రదర్శించింది. వివరాలివి..

భారత్, పాకిస్తాన్ మధ్య పంజాబ్ లో గల అంతర్జాతీయ సరిహద్దు వద్ద సుహృద్భావ దృశ్యం ఆవిష్కృతమైంది. పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడు పొరపాటున సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించగా, అతణ్ని క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చారు మన బీఎస్ఎఫ్ జవాన్లు. ఈనెల 26న పాక్ జాతీయుడైన ఓ యువకుడు పంజాబ్ బోర్డర్ దాటి ఇండియాలోకి రాగా, అతణ్ని బీఎస్ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తాను దారి తప్పి పొరపాటున వచ్చానని ఆ యువకుడు చెప్పాడు. పొరబాటున వచ్చాడా? లేక ఏదైనా దురుద్దేశంతో సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడ్డాడా? అన్న కోణంలో మనవాళ్లు క్షుణ్నంగా దర్యాప్తుచేశారు. చివరికి..

Karimnagar mlc : బండి సంజయ్‌కి ఈటల పోటు.. bjpకి కొత్త అధ్యక్షుడు.. సర్దార్ రవీందర్ సింగ్ ఖేల్ ఖతమంటూఆ యువకుడు పొరపాటుగానే సరిహద్దు దాటి వచ్చినట్లు నిర్ధారణ కావడంతో ఈనెల 27న(శనివారం) పాకిస్తాన్ రేంజర్లకు అప్పగించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. మానవతా దృక్పథంతోనే అతడిని సేఫ్‌గా విడిచిపెట్టామని బీఎస్ఎఫ్ పేర్కొంది. గతంలో పలుమార్లు పొరపాటున పాక్ లోకి వెళ్లిన భారతీయులను అక్కడి సైన్యం చంపడం, అరెస్టు చేసి న్యాయ సహాయం అందనీయకుండా జైలులో పెట్టడం లాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇదిలా ఉంటే,

బీఎస్ఎఫ్ జవాన్లతో పాక్ జాతీయుడు

shocking : డిప్రెషన్‌లో ఇంత దారుణమా? -మైనర్ కూతురుళ్లు, అడ్డొచ్చిన పోలీసు సహా 5గురిని కిరాతకంగా..జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మారుమూల గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం భారత ప్రభుత్వం డ్రోన్లను వినియోగిస్తున్నది. డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ల సరఫరాను శనివారం ప్రారంభిస్తూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తన డ్రోన్ల ద్వారా సరిహద్దులో ఆయుధాలను జారవిడుస్తోంటే, భారత్ మాత్రం అవే డ్రోన్లను మంచి పనులకు వినియోగిస్తోందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాలను గౌరవించుకోవాలనే పరస్పర అంగీకారం కుదరడంతో భారత్, పాక్ మధ్య మే నెల ఎలాంటి కవ్వింపులు చోటుచేసుకోవడంలేదు.
Published by:Madhu Kota
First published:

Tags: BSF, India pakistan border, Punjab

తదుపరి వార్తలు