HOME »NEWS »NATIONAL »pakistan minister gets electric shock during speech on modi says indian pm cant ruin gathering sk

మోదీ పేరెత్తగానే కరెంట్ షాక్...పాకిస్తాన్ మంత్రిపై తెగిపడిన తీగ

మోదీ పేరెత్తగానే కరెంట్ షాక్...పాకిస్తాన్ మంత్రిపై తెగిపడిన తీగ
పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్

భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశాలేమిటో మాకు తెలుసంటూ వ్యాఖ్యానిస్తుండగా పైనుంచి విద్యుత్ తీగపడి ఆయనకు షాక్ కొట్టింది. ఊహించని ఆ పరిణామంతో ఆయన వేదికపై తుళ్లిపడ్డారు.

  • Share this:
    ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోతోంది. కశ్మీర్ విభజనను జీర్ణించుకోలేని దాయాది భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో పాటు కేంద్రమంత్రులు కూడా కారుకూతలు కూస్తూనే ఉన్నారు. అడ్డగోలు ఆరోపణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మరోసారి మోదీపై విమర్శలు గుప్పించారు. ఐతే ఆ సభలో ఆయనకు విచిత్ర అనుభవం ఎదురయింది. సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ పేరెత్తగానే పైనుంచి కరెంట్ వైర్ పడి మంత్రికి షాక్ కొట్టింది.

    పీవోకేలోని ఓ బహిరంగ సభలో ప్రసంగించారు షేక్ రషీద్. ప్రధాని మోదీ నిర్ణయాలు, జమ్మూకశ్మీర్, ఆర్టికల్ 370 రద్దుపైనే ఆయన ప్రసంగించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశాలేమిటో మాకు తెలుసంటూ వ్యాఖ్యానిస్తుండగా పైనుంచి విద్యుత్ తీగపడి ఆయనకు షాక్ కొట్టింది. ఊహించని ఆ పరిణామంతో ఆయన వేదికపై తుళ్లిపడ్డారు. అనంతరం తేరుకొని మళ్లీ మాట్లాడారు. తనకు కరెంట్ వల్లే షాక్ కొట్టిందని...ఈ సభను మోదీ విఫలం చేయలేరంటూ సరదాగా అన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం రావల్పిండి సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు షేక్ రషీద్. అక్టోబర్‌ తర్వాత భారత్‌- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఇరుదేశాల మధ్య ఇదే చివరి యుద్ధం కానుందని వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం రేగింది.
    Published by:Shiva Kumar Addula
    First published:August 30, 2019, 20:22 IST