పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై వైమానిక దాడికి పాల్పడితే.. అందుకు బదులు తీర్చుకోవడానికి పాక్ భారత గగనతలంలోకి చొరబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత వైమానిక దళం పాక్ యుద్ద విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన F-16 యుద్ద విమానాన్ని కూడా పేల్చేసింది. అదే సమయంలో భారత్ యుద్ద విమానం సుఖోయ్-30ని తాము పేల్చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే అందుకు తగ్గ ఆధారాలు మాత్రం చూపించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఈ అంశంపై మొదటిసారి పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చింది. F-16 యుద్ద విమానాన్ని కోల్పోయామని చెప్పుకోలేక.. దాన్ని కవర్ చేసుకోవడానికి సుఖోయ్-30ని పేల్చేశామని పాకిస్తాన్ అవాస్తవాలు చెబుతోందని తెలిపింది. భారత సైనిక శిబిరాలపై దాడులకు యత్నించిన పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తరుపు నుంచి మిరాజ్-200, సుఖోయ్-30,మిగ్-21 యుద్ధ విమానాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Kashmir, Kashmir security, Narendra modi, Pulwama Terror Attack