• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • PAKISTAN LINKED ORGANIZATIONS COLLECTING FUNDS IN THE NAME OF INDIA BUT THERE IS CONSPIRACY GH SK

ఇండియా కోసం పాక్ సంస్థ‌ల విరాళాల సేక‌ర‌ణ‌.. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఇండియా కోసం సేక‌రించిన విరాళాలు ఉగ్ర‌వాదుల‌కు, పాకిస్థాన్ సైన్యానికి, మ‌త ఛాంద‌స‌వాదుల‌కు, పాల‌స్థీనా ఉగ్రవాద సంస్థ హ‌మాస్ వ‌ర‌కు ఎక్క‌డికైనా చేర‌వ‌చ్చ‌ని డిస్నోఫోలాబ్ నివేదిక‌ వెల్ల‌డించింది. దీనిని కోవిడ్ స్కామ్ 2021గా పిలుస్తున్నార‌ని ఆ నివేదిక పేర్కొంది.

  • Share this:
కోవిడ్ సంక్షోభంలో భార‌త‌దేశాన్ని ఆదుకునే పేరుతో కొన్ని పాకిస్థాన్‌ సంస్థ‌లు అమెరికాలో విరాళాలు సేక‌రిస్తున్నాయి. హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో కొన్ని లక్షల డాలర్ల విరాళాలు సేక‌రించిన ఈ సంస్థ‌లు, ఆ నిధులను పెద్ద ఎత్తున స‌క్ర‌మంగా ఖ‌ర్చుచేసినట్టు చెప్పుకుంటున్నాయి.  కానీ అస‌లు విష‌యం తెలియ‌క దాతలు మోసపోతున్నారని డిస్నోఫోలాబ్ అనే పరిశోధన, స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. ఇలా ఇండియా కోసం సేక‌రించిన విరాళాలు ఉగ్ర‌వాదుల‌కు, పాకిస్థాన్ సైన్యానికి, మ‌త ఛాంద‌స‌వాదుల‌కు, పాల‌స్థీనా ఉగ్రవాద సంస్థ హ‌మాస్ వ‌ర‌కు ఎక్క‌డికైనా చేర‌వ‌చ్చ‌ని డిస్నోఫోలాబ్ నివేదిక‌ వెల్ల‌డించింది. దీనిని కోవిడ్ స్కామ్ 2021గా పిలుస్తున్నార‌ని ఆ నివేదిక పేర్కొంది.

ఇండియాకు సాయం చేయాల‌నుకునే మంచి మ‌న‌సున్న వంద‌లాదిమంది డ‌బ్బును హెల్పింగ్ ఇండియా బ్రీత్ పేరుతో కొల్ల‌గొట్టార‌ని ఆ డాక్యుమెంట్ తెలిపింది. ఈ సొమ్ము ఎక్క‌డికి చేరాలో అక్క‌డికి చేర‌క‌పోగా. ఆందోళ‌న‌లు రేకెత్తించేవారికి, సామాజిక అల‌జ‌డులు సృష్టించేవారికి, టెర్ర‌రిస్టుల‌కు చేరుతున్నాయ‌ని డిస్నో ఫోలాబ్ ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి న‌డిచే ఇస్లామిక్ సంస్థ‌లు ఏప్రిల్ 27, 28 తేదీల్లో అమెరికాలో అనేక విరాళ‌సేక‌ర‌ణ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేశాయి. వీటిల్లో ఇమానా (ఇస్లామిక్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా) అనే సంస్థ విరాళాల‌సేక‌ర‌ణ‌లో దూకుడు చూపింది.

ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ సంస్థ చాలా వేగంగా విరాళాలు సేక‌రించింది. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ఈ సంస్థ త‌ను సేక‌రించ‌ద‌లుచుకున్న ల‌క్ష్యాన్ని పెంచుకుంటూ పోయింది. ఒక సారి అనుకున్న మొత్తం రాగానే మ‌రోసారి ఆ మొత్తాన్ని మ‌రింత పెంచుకుంటూ పోయింది. కానీ విరాళాలు సేక‌రించినంత బాగా వాటిని ఎలా వినియోగించార‌నే విష‌యంలో ఏ మాత్రం పార‌ద‌ర్శ‌క‌త చూప‌లేక‌పోయింది. ఇమానా ఇల్లినాయిస్ కేంద్రంగా ప‌నిచేసే ఒక వైద్య‌స‌హాయ సంస్థ‌. 1967లో ఇస్లామిక్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌గా (ఐఎంఏ)గా పురుడుపోసుకున్న ఈ సంస్థ త‌రువాత కాలంలో ఇమానాగా రూపాంతరం చెందింది.

ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (ఐఎస్ఎన్ఏ)లోని కొంద‌రు కీల‌క స‌భ్యులు ఈ ఐఎంఏను నెల‌కొల్పారు. అయితే ఈ సంస్థ సేక‌రించిన కోవిడ్ విరాళాల‌ను ఎలా ఖ‌ర్చుచేశారో వెల్లడించలేదు. ఎవ‌రైనా విరాళాల ఖర్చు గురించి ప్ర‌శ్నిస్తే.. ఇస్లామాఫోబియా అనే స‌మాధానంతో వారి నోళ్లు మూయిస్తోంద‌ని ఆ నివేదిక పత్రులు తెలిపాయి.

హెల్ప్ ఇండియా బ్రీత్ క్యాంపెయిన్ పేరుతో ఇన్‌స్టాలో ఏ్రప్రిల్ 27న ఈ సంస్థ విరాళాల‌సేక‌ర‌ణ హ‌డావుడి ప్రారంభ‌మైంది. తొలుత రూ.1.8 కోట్లు ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇక హ‌మానా ఇండియ‌న్స్ నుంచి విరాళాలు సేక‌రించేందుకు భార‌త‌దేశం రూపొందించిన ఇండియా మ్యాప్‌ను ఉప‌యోగించ‌గా, త‌న వెబ్‌సైట్‌లో మాత్రం కశ్మీర్‌ను క‌లిపేసుకున్న పాక్ మ్యాప్‌ను ఉంచింది. నిజానికి త‌ట‌స్థంగా ఉండాల్సిన ఈ సంస్థ క‌నీసం ఐక్య‌రాజ్య‌స‌మితి ఉప‌యోగించే మ్యాప్‌ను అయినా వాడి ఉండాల్సిదంటూ డిస్నోఫోలాబ్ రిపోర్టు ఆక్షేపించింది.

విరాళాల సేక‌ర‌ణ‌కు ఇమానా పిలుపుకు ఇటు ఇండియాతోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్పంద‌న రావ‌డంతో తొలుత రూ.1.8 కోట్లు ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ ఆ మొత్తాన్ని రూ.5.62 కోట్ల‌కు పెంచింది. మొత్తంగా ఇమానా ఒక్క ఇన్‌స్టాలోనే రూ.5.62 కోట్లు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ప్ప‌టికీ 8.7 కోట్ల రూపాయ‌లు సేక‌రించింద‌ని నివేదిక వెల్ల‌డించింది. ఇక లాంచ్‌గుడ్ అనే విరాళాల‌సేక‌ర‌ణ ఫ్లాట్‌ఫామ్ కూడా త‌క్కువేం తిన‌లేదని డిస్నోఫోలాబ్ నివేదిక పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published: