ప్రముఖ నగరాల్లో గొడవలు సృష్టించేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నం...ఐబీ హెచ్చరికలు...

దేశంలోని ప్రముఖ నగరాల్లో అల్లర్లు సృష్టించేందుకు ఐఎస్‌ఐ కుట్ర చేసిందని ఐబి నిఘా వర్గాలను, సైన్యాన్ని, పోలీసులను హెచ్చరించింది. ముఖ్యంగా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, సైన్యం అప్రమత్తంగా ఉండాలని ఐబి సూచించింది.


Updated: August 20, 2019, 9:36 PM IST
ప్రముఖ నగరాల్లో గొడవలు సృష్టించేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నం...ఐబీ హెచ్చరికలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత నిఘా సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పోలీసులు హెడ్ క్వార్టర్స్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏజెంట్లు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఐఎస్ఐ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ దేశంలో ప్రవేశించినట్టు ఐబి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దేశంలోని ప్రముఖ నగరాల్లో అల్లర్లు సృష్టించేందుకు ఐఎస్‌ఐ కుట్ర చేసిందని ఐబి నిఘా వర్గాలను, సైన్యాన్ని, పోలీసులను హెచ్చరించింది. ముఖ్యంగా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, సైన్యం అప్రమత్తంగా ఉండాలని ఐబి సూచించింది. అలాగే అనుమానిత వ్యక్తులు, కొత్తగా తమ ప్రాంతాల్లో సంచరిస్తున్న వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఐబి ప్రజలకు సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారు. రాజస్థాన్, గుజరాత్ మీదుగా వీరు దేశంలోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి.

నిఘా సంస్థల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ అప్రమత్తం అయ్యాయి. అలాగే దేశంలోని అన్ని రేవు పట్టణాలను తీర గస్తీ దళాలను సైతం అలర్ట్ గా ఉండాలని నిఘా సంస్థలు హెచ్చరించాయి. గతంలో తీరప్రాంతాల గుండాలనే ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించినట్లు ఐబీ తెలిపింది.
Published by: Krishna Adithya
First published: August 20, 2019, 9:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading