మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు పాకిస్తాన్ ఆహ్వానం..

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం.. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ను ఆహ్వానించబోతోంది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖురేసి ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

news18-telugu
Updated: September 30, 2019, 5:48 PM IST
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు పాకిస్తాన్ ఆహ్వానం..
మన్మోహన్, ఖురేషి
  • Share this:
నవంబరులో సిక్కుల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. నవంబరు 9న కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం.. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ను ఆహ్వానించబోతోంది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఖురేషి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. త్వరలోనే అధికారికంగా మన్మోహన్‌ను ఆహ్వానిస్తామని వెల్లడించారు.

పాకిస్తాన్ తరపున భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ను కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నా. త్వరలోనే అధికారిక ఆహ్వాన పత్రికను పంపుతాం. మన్మోహన్ గౌరవనీయమైన నాయకుడు.
షా మహమూద్ ఖురేషీ


ఖురేసీ ఆహ్వానాన్ని మన్నించి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ వెళ్తారా? లేదా? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై మన్మోహన్ సింగ్ కార్యాలయం స్పందించినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ స్థాయిలో అంతర్జాతీయ ఆహ్వానాలు అందినప్పుడు విదేశాంగశాఖ సలహా తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం. విదేశాంగశాఖతో చర్చించాకే పాకిస్తాన్‌కు వెళ్లాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

గురుద్వారా దర్బార్ సాహిబ్ (కర్తార్‌పూర్ సాహిబ్) సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపినట్లు విశ్వసిస్తారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఈ గురుద్వారా ఉంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ నుంచి కర్తార్‌పూర్‌కు కారిడార్ నిర్మించాలని 1999లో అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రతిపాదించారు. కానీ సాధ్యం కాలేదు. ఐతే ఎట్టకేలకు భారత్-పాకిస్తాన్ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తిచేశాయి. అంతర్జాతీయ సరిహద్దు నుంచి తమ భూభాగంలో రహదారి నిర్మించింది పాకిస్తాన్. ఎలాంటి వీసా అనుమతులు లేకుండా భారతీయ సిక్కులు గురుద్వారా దర్వార్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చు.
Published by: Shiva Kumar Addula
First published: September 30, 2019, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading