హోమ్ /వార్తలు /జాతీయం /

పాకిస్థాన్‌కి మాటలు చాలలేదు... చేతల్లో చూపించాం : సుష్మాస్వరాజ్

పాకిస్థాన్‌కి మాటలు చాలలేదు... చేతల్లో చూపించాం : సుష్మాస్వరాజ్

సుష్మాస్వరాజ్ (File)

సుష్మాస్వరాజ్ (File)

India Vs Pakistan : పాకిస్థాన్ లాంటి దేశానికి మాటలతో కంటే చేతలతో చూపించడమే సరైన మార్గమంటున్నారు సుష్మాస్వరాజ్. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.

పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉద్రవాదంపై ఆ దేశానికి ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయిందన్నారు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌. రష్యా, చైనా, భారత్‌ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం చైనా వెళ్లిన ఆమె ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో భేటీ అయ్యారు. పుల్వామా ఉగ్ర దాడి, ప్రతిగా భారత్ జరిపిన వైమానిక దాడుల్ని ఆమె వివరించారు. పరిస్థితి చేజారి పోకూడదన్న ఉద్దేశంతోనే వైమానిక దాడులు చేశామని తెలిపారు. భారత్ ఎప్పుడూ సంయమనం పాటిస్తూ... బాధ్యతతో నడుచుకుంటుందని వెల్లడించారు. పాక్‌ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కి ఎన్నిసార్లు హెచ్చరించినా... అక్కడి ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదన్న వాస్తవాల్ని బయటపెట్టారు.


40 మంది జవాన్లను కోల్పోయి దేశం విషాదంలో ఉన్న టైంలో చైనాకు వెళ్లాల్సి వచ్చిందన్న సుష్మాస్వరాజ్... పుల్వామా దాడికి పాకిస్థాన్‌ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ సంస్థే కారణమన్నారు. పాక్‌ వైపు నుంచి ఆ సంస్థకు అన్ని విధాలా మద్దతు లభిస్తోందని వివరించారు. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేశామన్న ఆమె... వైమానిక దాడిలో బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద సంస్థ శిబిరాన్ని నేలమట్టం చేశామని వాంగ్‌ యీకి తెలిపారు.


తాజా పరిస్థితులపై చైనా ఆచితూచి స్పందిస్తోంది. రెండు దేశాలూ సంయమనం పాటించాలని కోరింది. పుల్వామా దాడిని చైనా కూడా ఖండించింది. అయినప్పటికీ జైషే మహ్మద్‌ చీఫ్ మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి మాత్రం చైనా ముందుకు రావట్లేదు. ఇదే భారత్‌కి ఇబ్బంది కలిగిస్తోంది.


 

ఇవి కూడా చదవండి :


యుద్ధమా... శాంతా... 72 గంటల్లో తేలుతుంది... పాక్ రైల్వే మంత్రి ప్రకటన


కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే


పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...


పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే


 

First published:

Tags: India, India VS Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

ఉత్తమ కథలు