• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PAKISTAN FOREIGN MINISTER ALLEGES IN ABU DHABI THAT INDIA PLANNING STRIKE AGAINST PAKISTAN NK

భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేయబోతోంది... పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆరోపణలు

భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేయబోతోంది... పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆరోపణలు

భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేయబోతోందా?... పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? (File images - Shah Mehmood Qureshi (Right))

Strike against Pakistan: ఇండియా అంటే పాకిస్థాన్ హడలిపోతోంది. ఏ క్షణమైనా తమపై భారత్ దాడి చేసేలా ఉందని తెగ టెన్షన్ పడుతోంది. సడెన్‌గా ఈ ఫియర్ ఎందుకు?

  • Share this:
    India Strike against Pakistan?: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ శుక్రవారం ఓ సంచలన ప్రకటన చేశారు. ఇండియాలోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు... పాకిస్థాన్‌పై మరోసారి సర్జికల్ స్ట్రైక్ జరిపేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్లాన్ వేసినట్లు తమకు అత్యంత నమ్మదగిన సమాచారం ఉందని ఖురేషీ అన్నారు. ఈ దాడి కోసం భారత ప్రభుత్వం మద్దతు కూడగట్టే పనిలో ఉందని అన్నారు. ఈ ప్రకటన పాకిస్థాన్‌లో చెయ్యలేదు. అబూదాబీలోని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేశారు. ఈ ఖురేషీ... అక్కడకు రెండ్రోజుల పర్యటన కోసం వెళ్లారు. ఆ పర్యటనలో ఎమిరేట్ పాలకులతో మీటింగ్స్‌లో పాల్గొన్నారు. రెండ్రోజుల పర్యటన తర్వాత... తన టూర్ ఎలా సాగిందో, ఏయే డీల్స్ కుదుర్చుకున్నదీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెబుతూ ఖురేషీ... ఇండియా ప్రస్తావన తెచ్చారు. నిఘా వర్గాల ద్వారా తనకు ఈ సర్జికల్ స్ట్రైక్ విషయం తెలిసిందన్నారు.

    "ఓ ముఖ్యమైన విషయం తెలిసింది. నాకు మా నిఘా వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది. ఇండియా పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ప్లాన్ వేసింది" అన్న ఖురేషీ... "ఇది చాలా సీరియస్ డెవలప్‌మెంట్. భారత ప్రభుత్వం మద్దతు కూడగడుతోంది. తనకు కీలకం అని భావిస్తున్న భాగస్వాములతో దీనిపై చర్చిస్తోంది" అన్నారు. అక్కడితో అయిపోలేదు... మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది. ఇందుకు సంబంధించిన రిపోర్టును అంతర్జాతీయ కమ్యూనిటీ ముందు మేము బయటపెట్టాము" అన్నారు. "పాకిస్థాన్ ప్రతిష్టను దెబ్బ తియ్యడానికి నకిలీ వెబ్ సైట్లు, నకిలీ ఎన్జీవోలను భారత్ ప్రోత్సహిస్తోందని ఈ మధ్య EU డిసిన్ఫోల్యాబ్... ఓ రిపోర్ట్ బయటపెట్టింది" అని కూడా ఖురేషీ ఆరోపించారు. భారత్ ఆక్రమించిన కాశ్మీర్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని ఆయన అన్నారు.

    రైతుల ఉద్యమమేనా?:
    భారత్‌లో తీవ్ర అంతర్గత సమస్యలున్నాయి అని ఖురేషీ... రైతుల ధర్నాను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. "పంజాబ్, ఢిల్లీలో ఆందోళనలు దేశవ్యాప్తమైనవి. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రైతుల ధర్నాలకు ప్రతిపక్షాలు, లాయర్లు, సివిల్ సొసైటీ, వ్యాపార యూనియన్ల నుంచి మద్దతు లభిస్తోంది" అని ఖురేషీ వ్యాఖ్యానించారు.

    ఇది కూడా చదవండి:కానిస్టేబుల్‌తో లేడీ ఎస్సై వివాహేతర సంబంధం... తనకు న్యాయం చేయాలంటున్న పోలీస్ భార్య

    "కరోనా వైరస్‌ని ఇండియా సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేకపోయిన విషయం అందరికీ తెలుసు. దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతలా పడిందో కూడా తెలుసు. ఇండియాలోని మైనార్టీలు సంతృప్తిగా లేరు. భారత్ ఏం చేసినా... దాన్ని ఎదుర్కోవడానికి పాకిస్థాన్ పూర్తి సన్నద్ధంగా ఉంది" అని అన్నారు. "2019 ఫిబ్రవరిలో ఎలా సమాధానం చెప్పామో... ఈసారీ అలాగే సమాధానం చెబుతాం" అని ఖురేషీ అన్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు