రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానానికి పాకిస్థాన్ గగనతలంలో నో ఎంట్రీ...

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యూరప్ లోని ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా దేశాల పర్యటనకు సోమవారం బయలుదేరనున్నారు. కాశ్మీర్ అంశంపై భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ పాక్ గగనతలం మీదుగా విదేశీ పర్యటనకు వీలు కల్పించ వద్దని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి ఖురేషి వెల్లడించారు.

news18-telugu
Updated: September 7, 2019, 10:58 PM IST
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానానికి పాకిస్థాన్ గగనతలంలో నో ఎంట్రీ...
రామ్‌నాథ్ కోవింద్
  • Share this:
పాకిస్థాన్ మరోసారి తన దుర్భుద్ధిని బయటపెట్టుకుంది. తాజాగా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణిస్తున్న విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని పాకిస్థాన్ తిరస్కరించింది. ఇదే విషయాన్ని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ మెహమూద్ ఖురేషి అధికారికంగా వెల్లడించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే పాకిస్థాన్ నుంచి తూర్పు దేశాలకు వెళ్లేందుకు భారత గగనతలమే దిక్కు. అయినప్పటికీ పాక్ అహంకార పూరిత చేష్టలపై అంతర్జాతీయ సమాజం విస్తుపోయింది. ఇదిలా ఉంటే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యూరప్ లోని ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా దేశాల పర్యటనకు సోమవారం బయలుదేరనున్నారు. కాశ్మీర్ అంశంపై భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్ పాక్ గగనతలం మీదుగా విదేశీ పర్యటనకు వీలు కల్పించ వద్దని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి ఖురేషి వెల్లడించారు.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>