పాకిస్థాన్ బుద్ధి కుక్కతోక వంకర తీరే...భారత ఆర్మీ చీఫ్ విమర్శ

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న వేళ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

news18-telugu
Updated: April 18, 2020, 8:16 AM IST
పాకిస్థాన్ బుద్ధి కుక్కతోక వంకర తీరే...భారత ఆర్మీ చీఫ్ విమర్శ
ప్రతీకాత్మక చిత్రం (image: Bharat Ke Veer)
  • Share this:
కరోనా కోరలు చాస్తున్నా పాకిస్తాన్ మాత్రం తీరును మార్చుకోవడం లేదని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) రేఖ వద్ద పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న వేళ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను పర్యవేక్షించేందుకు నరవాణే రెండు రోజుల పర్యటన నిమిత్తం కశ్మీర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తుంటే పొరుగు దేశం మాత్రం మనల్ని ప్రమాదంలో పడేయాలని చూడటం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. మన పౌరులను కాపాడుకుంటూనే.. ఇతర దేశాలకు వైద్య బృందాలను పంపిస్తూ… ఔషధాలు ఎగుమతి చేస్తూ మనం బిజీగా ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోందని ఆయన దుయ్యబట్టారు.
Published by: Krishna Adithya
First published: April 18, 2020, 8:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading