భారత్‌తో జరిగేది అణుయుద్ధమే : ఇమ్రాన్ ఖాన్

Imran Khan : భారత్‌తో యుద్ధానికి దిగితే... పాకిస్థాన్ ఓడిపోయే పరిస్థితి వస్తే... రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి లొంగిపోవడం, రెండోది స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించడం" అన్న ఇమ్రాన్ ఖాన్... పాకిస్థాన్... స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తుందని అన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 11:12 AM IST
భారత్‌తో జరిగేది అణుయుద్ధమే : ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్ ఖాన్
  • Share this:
జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్... రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆపట్లేదు. అల్ జజీరాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన భారత్‌తో యుద్ధంలో పాకిస్థాన్ ఓడిపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు. పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధానికి వ్యతిరేకమే అన్న ఆయన... ముందుగా తాము అణ్వాయుధ దాడి చెయ్యబోమని అన్నారు. అదే సమయంలో... రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధానికి దిగినప్పుడు... చివరకు జరిగేది అణుయుద్ధమే అన్నారు. "భారత్‌తో యుద్ధానికి దిగితే... పాకిస్థాన్ ఓడిపోయే పరిస్థితి వస్తే... రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి లొంగిపోవడం, రెండోది స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించడం" అన్న ఇమ్రాన్ ఖాన్... పాకిస్థాన్... స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తుందని అన్నారు. పాకిస్థాన్ అణ్వాయుధ దేశం కాబట్టి... తాడోపేడో తేల్చుకోవడానికి తీవ్ర పరిణామాలు తప్పవని"... పరోక్షంగా అణ్వాయుధ దాడి తప్పదన్నట్లు మాట్లాడారు ఇమ్రాన్ ఖాన్.

NDA ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచీ... ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్... కాశ్మీర్‌లో పరిస్థితులు మరింత మందిని భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంవైపు నడిపించేలా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ సమాజం ద్వారా కాశ్మీర్ అంశం పరిష్కారం కాకపోతే, ఆ ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై పడుతుందన్నారు.

భారత ప్రభుత్వం మాత్రం... జమ్మూకాశ్మీర్... భారత అంతర్గత వ్యవహారమనీ, ఇందులో పాకిస్థాన్ జోక్యం తగదని చెబుతూ వస్తోంది. గతవారం పాకిస్థాన్... ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని ఆశ్రయించింది. జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షల్ని ఎత్తివేయించాలని కోరింది. దీనిపై స్పందించిన భారత్... సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచిపోషిస్తోందని మండిపడింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గనుక ఈ అంశంలో జోక్యం చేసుకుంటే... పరిష్కారం లభించే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ పరోక్షంగా అన్నారు. దీనిపై ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించారు. భారత్ మాత్రం... ఇందులో మరొకరి జోక్యం కుదరదని స్పష్టం చేసింది.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading