కరోనావైరస్ మహమ్మారి మధ్యలో కూడా, పాకిస్తాన్ కవ్వింపు చేష్టలను ఆపడంలేదు. గురువారం రాత్రి, జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్ రంగాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం పలు పోస్టులపై నిరంతరం కాల్పులు జరుపుతోంది. అయితే, ఈ దుర్మార్గపు చర్యకు భారత సైన్యం కూడా తగిన సమాధానం ఇస్తోంది.
పాకిస్తాన్ తరపున, రాజౌరి సెక్టార్లోని భారత ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. పాకిస్తాన్ కాల్పులపై భారత సైన్యం దీటుగా సమాధానం చెప్పింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ పోస్టుకు పెద్ద నష్టం వాటిల్లిందని భారత సైన్యం వర్గాలు సమాచారం అందించాయి.
ఇదిలా ఉంటే 2020 లో పాకిస్తాన్ 16 సంవత్సరాల్లోనే గరిష్ట స్థాయిలో కాల్పుల ఉల్లంఘన జరిపినట్లు సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి. 2019 లో, మొత్తం 3168 కాల్పుల విరమణను ఉల్లంఘించినప్పటికీ, ఈ సంవత్సరం ఇంకా 6 నెలలు పూర్తి కాలేదు. అప్పుడే కాల్పుల విరమణను పాకిస్తాన్ 2027 సార్లు ఉల్లంఘించింది. గత ఏడాది జనవరి నుంచి మే వరకు పాకిస్తాన్ కాల్పుల విరమణను 1140 సార్లు ఉల్లంఘించగా, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 1913 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది.
Published by:Krishna Adithya
First published:June 12, 2020, 08:20 IST