హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jammu Kashmir: భద్రతాదళాల దెబ్బకు పాకిస్తాన్ విలవిల.. టెర్రరిస్టులకు అదే దిక్కు

Jammu Kashmir: భద్రతాదళాల దెబ్బకు పాకిస్తాన్ విలవిల.. టెర్రరిస్టులకు అదే దిక్కు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jammu Kashmir: సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం కావటంతో మన సైనికుల డేగ కళ్ల నుంచి తప్పించుకోలేక పోతున్న ఐఎస్ఐ (ISI), టెర్రర్ గ్రూపులు ఇప్పుడు మొబైల్ స్పేస్, సైబర్ స్పేస్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి.

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేశాక.. అక్కడ శాంతి సుస్థిరత, అభివృద్ధిని జీర్ణం చేసుకోలేని పాకిస్థాన్ ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించటం మొదలుపెట్టింది. చొరబాట్లు, ప్రాక్సీ వార్, స్థానికంగా హింస, భద్రతా దళాలపై నిత్యం దాడులు, ఆత్మాహుతి దాడులు, డ్రోన్స్ ద్వారా డ్రగ్స్.. ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా టెక్నాలజీని ప్రయోగిస్తూ కశ్మీరీలను ఎలా రెచ్చగొడుతోందో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కశ్మీరీలను వేధిస్తున్నట్టు భారత భద్రతా దళాలను ఫేక్ వీడియోల ద్వారా సృష్టించి.. వాటిని అదేపనిగా ముష్కర మూకలు వైరల్ చేస్తున్నాయి. అంతేకాదు జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాల నిఘా పెరగడంతో ఆన్‌లైన్ వేదికగా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి.

సైబర్ స్పేస్‌లో రిక్రూట్‌మెంట్:

సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం కావటంతో మన సైనికుల డేగ కళ్ల నుంచి తప్పించుకోలేక పోతున్న ఐఎస్ఐ (ISI), టెర్రర్ గ్రూపులు ఇప్పుడు మొబైల్ స్పేస్, సైబర్ స్పేస్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తున్నాయి. స్థానికుల ఎమోషన్స్‌ను తరచూ రెచ్చగొట్టి రావణకాష్టాన్ని రాజేస్తున్న ఈ టెర్రర్ గ్రూపులకు అండగా ఉన్న 40 మందికి పైగా సానుభూతిపరుల అరెస్టుతో వీరి తాజా నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. నిఘా వర్గాల కళ్లుకప్పి భౌతికంగా రిక్రూట్మెంట్లు జరపటం సాధ్యం కాకపోవటంతో ఉగ్రమూకల సానుభూతిపరుల సపోర్ట్ తో ఇవన్నీ తవ్వుతుండగా పట్టుబడ్డ ఇద్దరు యువ తీవ్రవాదులు మాత్రం తమకు సైబర్ స్పేస్‌లో వల వేసినట్టు వెల్లడించారు.

సోషల్ మీడియానే దిక్కు:

ఈ ఊబిలోకి చేరకముందే తాము ఫేస్ బుక్ (Facebook)ద్వారా పాక్ లోని ఉగ్రమూకల లీడర్లను కలుసుకున్నట్టు.. ఆన్లైన్లోనే తాము ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకు పబ్లిక్ ప్లాట్ ఫార్మ్స్ అయిన యూట్యూబ్ (Youtube) వంటి వాటి సేవలను ఉపయోగించారని, తమ లీడర్లు ప్రత్యక్షంగా తాము ఒకే ఒకసారి షోపియాన్ లో మాత్రమే కలిసినట్టు వీరు వెల్లడించారు. దీంతో కశ్మీర్ లోయలో ఇంకా స్లీపర్ సెల్స్ (sleeper cells) చురుగ్గా ఉన్న విషయం మరోమారు తేటతెల్లం అయింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఈ-తోయిబా కు (LeT) అనుబంధంగా పనిచేసే 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) కోసం తాము రిక్రూట్ అయినట్టు పట్టుబడ్డ ఉగ్రవాదులు వివరించారు. పాకిస్థాన్ లోని బుర్హాన్ హమ్జా తమకు అవసరమైన మత ప్రవచనాలు, ఆదేశాలు అన్నీ చేస్తారని వీరు తెలిపారు. కశ్మీర్ దక్షిణ ప్రాంతంలో ఇలా కొత్తగా రిక్రూట్ అయినవారు చాలామంది దాడులకు సిద్ధంగా ఉన్నట్టు భద్రతాదళాలు వెల్లడిస్తున్నాయి.

వాట్సప్ గ్రూపులు ఖతమ్:

మరోవైపు ఉగ్రమూకలకు ఆయుధాల కొరత, వ్యక్తుల కొరత తీవ్రంగా ఉందని మన భద్రతా దళాలు స్పష్టంగా గుర్తించాయి. గతంలో పెయిడ్ వాట్సప్ గ్రూపు (Whatsapp groups)ల ద్వారా రాళ్లు రువ్వటం, భద్రతా దళాలపై దాడి చేయించటాన్ని పనిగా పెట్టుకున్న ముష్కర మూకలు అవన్నీ సమర్థవంతంగా భారత ప్రభుత్వం బంద్ చేయించగా..కొత్త మార్గాల్లో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. పాక్ ముష్కరులు కొత్త దారిలో రిక్రూట్మెంట్ చేస్తుండటం నిఘావర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనూ పాక్ ముష్కర మూకల దూకుకు కళ్లెం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదమనే పదమే వినిపించకుండా దెబ్బకొట్టేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Jammu and Kashmir, Terrorism, Terrorists

ఉత్తమ కథలు