Surgical Strike 3.0: పాకిస్థాన్ కుట్రలు భగ్నం...ముంబై తరహా దాడులకు స్కెచ్

ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంచాలని ఆదేశించింది. టూరిస్ట్ స్పాట్లలో భద్రత రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖా సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత బలగాలు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు.

news18-telugu
Updated: October 20, 2019, 4:48 PM IST
Surgical Strike 3.0: పాకిస్థాన్ కుట్రలు భగ్నం...ముంబై తరహా దాడులకు స్కెచ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 20, 2019, 4:48 PM IST
ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో ఊగిపోతున్న ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ లోయలో భారీ కుట్రకు తెరలేపాయి. ఇప్పటికే ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో భారీగా భద్రతను పెంచేశారు. కాశ్మీర్ లో భారీ ఉగ్ర దాడికి వ్యూహ రచన చేస్తోందని ఐబీ వెల్లడించింది. అలాగే ముంబై భారత్‌లో కూడా 9/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితోపాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌ కోట్‌, జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లో  అలర్ట్‌ ప్రకటించారు.

ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర హోం  శాఖ దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంచాలని ఆదేశించింది. టూరిస్ట్ స్పాట్లలో భద్రత రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖా సూచించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత బలగాలు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...