• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PAKISTAN ATTEMPTED BALAKOT LIKE AIR STRIKES IN INDIA BUT FAILED REPORT SK

భారత్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి విఫలం..అసలు ఆ రోజు ఏం జరిగిందంటే....?

భారత్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి విఫలం..అసలు ఆ రోజు ఏం జరిగిందంటే....?

పుల్వామా దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాలకోట్‌లో వైమానిక దాడులు చేసింది. (File Image : PTI)

పాకిస్తాన్ యుద్ధ విమానాల రాకను భారతదళాలు పసిగట్టాయి. శత్రుదేశం దాడులను ముందే ఊహించి అందుకు సన్నద్ధంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ విమానాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. మన విమానాలను చూసి కంగారుపడిన పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ హడావిడిగా బాంబులను వదిలాయి.

  • Share this:
    ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై భారత్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిరాజ్-2000 విమానాలు జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై విరుచుకుపడ్డాయి. ఐతే ఆ మరుసటి రోజే భారత్‌పై ప్రతీకార దాడులకు యత్నించింది పాకిస్తాన్. ఫిబ్రవరి 27న భారత వైమానిక స్థావరాలే లక్ష్యంగా పాక్ వాయుసేన దూసుకొచ్చింది. కానీ భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉండడంతో పాకిస్తాన్ పప్పులు ఉడకలేదు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు తరమడంతో పాక్ విమానాలు తోకముడిచాయి. ఆ క్రమంలోనే పాకిస్తాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్ కూలిపోగా...భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఐతే ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై పలు కీలక అంశాలను ANI వార్తాసంస్థకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    బాలాకోట్ దాడులపై రగిలిపోయిన పాకిస్తాన్..భారత్ మిలటరీ స్థావరాలపై దాడులకు స్కెచ్ వేసింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక స్థావరాల నుంచి 20కి పైగా యుద్ధ విమానాలు భారత్‌ వైపు దూసుకొచ్చాయి. అందులో ఎఫ్-16, ఫ్రెంచ్ మిరాజ్-3, చైనీస్ జేఎఫ్-17 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఆ విమానాలన్నీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గగనతలం నుంచే మూడు భారత మిలటరీ స్థావరాలను టార్గెట్ చేశాయి. 100 కేజీల బరువున్న 11 H-4 బాంబులను మన సైనిక స్థావరాలపై ప్రయోగించాయి. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సత్తా వీటికుంది. ఐతే ఆ బాంబులన్నీ గురితప్పి వేర్వేరు చోట్ల పడిపోయాయి. మిలటరీ స్థావరాల చుట్టూ పొడవైన భారీ చెట్లు ఉండడంతో పాకిస్తాన్ దాడి విఫలమైంది.

    ఐతే అప్పటికే పాకిస్తాన్ యుద్ధ విమానాల రాకను భారతదళాలు పసిగట్టాయి. శత్రుదేశం దాడులను ముందే ఊహించి అందుకు సన్నద్ధంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ విమానాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. మన విమానాలను చూసి కంగారుపడిన పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ హడావిడిగా బాంబులను వదిలాయి. లక్ష్యాలను సరిగ్గా అంచనావేయకపోవడంతో బాంబులు వేర్వేరు చోట్ల పడిపోయాయి. ఇక మరో మిలటరీ క్యాంప్‌లో దట్టంగా చెట్లు ఉండడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పాకిస్తాన్‌కు చెందిన మిరాజ్-3 విమానాలు హెచ్-4 బాంబులతో మిలటరీ స్థావరాలను టార్గెట్ చేయగా...ఎఫ్-16 విమానాలు ఇండియన్ ఫైటర్ జెట్స్‌పై దాడి కోసం ఆమ్రాం క్షిపణులను ప్రయోగించాయి.


    పాకిస్తాన్ దాడిలో భారత్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఐతే దాయాది యుద్ధ విమానాలను తరిమికొట్టే క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ నడిపిన మిగ్-21 విమానం మాత్రం కోల్పోయింది. అభినందన్ ప్రయోగించిన R-73 ఎయిర్ టూ ఎయిర్ మిసైల్ దెబ్బకు పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కూడా కుప్పకూలింది. ఐతే ఆ పాకిస్తాన్ మాత్రం ఆ విషయాన్ని కప్పిపెట్టింది. ఎందుకంటే అమెరికా ఇచ్చిన ఎఫ్-16 ఉగ్రవాద నిర్మూలన కోసమే వాడాలి. ఇతర దేశాలపై వాటిని ప్రయోగించకూడదు. కానీ అమెరికా నిబంధనలను ఉల్లంఘించిన పాకిస్తాన్..భారత్‌పై దాడికి ఎఫ్-16ని ఉపయోగించింది.ఐతే అమెరికా ఆంక్షలు విధిస్తుందన్న భయంతో అసలు ఎఫ్-16 ని ప్రయోగించలేదని బుకాయిస్తోంది. కానీ భారత్ వాదనను పరిగణలోకి తీసుకున్న అమెరికా...పాకిస్తాన్‌కు అందించిన ఎఫ్-16 విమానాల లెక్కపై ఆరాతీస్తోంది.
    First published:

    అగ్ర కథనాలు