పాకిస్తాన్ ఓవరాక్షన్..గుజరాత్ బోర్డర్‌లో SSG కమాండోల మోహరింపు

గుజరాత్‌లోని సర్‌క్రీక్ ప్రాంతంలో భారీ సంఖ్యలో SSG (స్పెషల్ సర్వీసెస్ గ్రూప్) కమాండోలను మోహరించినట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి.

news18-telugu
Updated: August 21, 2019, 9:19 PM IST
పాకిస్తాన్ ఓవరాక్షన్..గుజరాత్ బోర్డర్‌లో SSG కమాండోల మోహరింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఎల్‌వోసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చెలరేగిపోతోంది. ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే..మరోవైపు ఉగ్రచొరబాట్లను ప్రోత్సహిస్తోంది. కశ్మీర్‌లో భారత బలగాలు భారీగా మోహరించడంతో పాకిస్తాన్ సైన్యం పప్పులు ఉడకలేదు. దాంతో మకాన్ని గుజరాత్ సరిహద్దుకు మార్చింది. గుజరాత్ మీదుగా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్‌లోని సర్‌క్రీక్ ప్రాంతంలో భారీ సంఖ్యలో SSG (స్పెషల్ సర్వీసెస్ గ్రూప్) కమాండోలను మోహరించినట్లు ఆర్మీ వర్గాలు గుర్తించాయి.

ఇక్బాల్-వజ్వా పోస్టులో కమాండోలను మోహరించినట్లు తెలుస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాల కోసమే వారిని మోహరించినట్లు ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. గుజరాత్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ఆర్మీ బలగాల కదలికలను భారత్ నిశితంగా గమనిస్తోంది. పాక్ బలగాలు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది.

Published by: Shiva Kumar Addula
First published: August 21, 2019, 9:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading