ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు..పాకిస్తాన్ ప్రధాని కీలక నిర్ణయం

ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఇమ్రాన్ ఖాన్ మొదట భావించారు. ఐతే మూడేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా ప్రధానిపై జావెద్ భజ్వా ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.

news18-telugu
Updated: August 19, 2019, 5:45 PM IST
ఆర్మీ చీఫ్ పదవీకాలం పొడిగింపు..పాకిస్తాన్ ప్రధాని కీలక నిర్ణయం
పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ భజ్వా
news18-telugu
Updated: August 19, 2019, 5:45 PM IST
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్మీ చీఫ్ మేజర్ జావెద్ భజ్వా పదవీ కాలాన్నీ పొడిగిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం హాట్‌టాపిక్‌గా చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆర్మీ చీఫ్ పదవీకాలం ముగియనుంది. ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఇమ్రాన్ ఖాన్ మొదట భావించారు. ఐతే మూడేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా ప్రధానిపై జావెద్ భజ్వా ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ జావెద్ భజ్వా తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. కశ్మీలకు పాకిస్తాన్ అండంగా ఉంటుందని ఆయన గతంలో చెప్పారు. కశ్మీరీల స్వాతంత్ర్య పోరాటానికి పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన పదవీ కాలాన్ని మూడేళ్ల పాటు పెంచడం చర్చనీయాంశమైంది. ఇండియా-పాకిస్తాన్ మధ్య తాజా పరిస్థితుల దృష్యా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...