కొత్త సంవత్సరాదినే కయ్యానికి కాలుదువ్విన పాక్

కొత్త సంవత్సరాది రోజున జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో దేశ నియంత్రణ రేఖ వెంబడి ఏకపక్ష కాల్పులు జరుపుతూ పాక్ రేంజర్లు కయ్యానికి కాలుదువ్వారు.

news18-telugu
Updated: January 2, 2020, 10:13 AM IST
కొత్త సంవత్సరాదినే కయ్యానికి కాలుదువ్విన పాక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్ముకశ్మీర్‌లోని దేశ నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు కొత్త సంవత్సరాది రోజునే కయ్యానికి కాలుదువ్వారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘటి సెక్టార్‌లో బుధవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడిచారు. రాత్రి 9 గంటల సమయంలో భారత భూభాగంవైపు ఏకపక్ష కాల్పులు జరుపుతూ భారత సేనలను పాక్ రేంజర్లు రెచ్చగొట్టారు. దీంతో భారత సేనలు కూడా ధీటుగా స్పందించాయి. దీంతో పాక్ సేనలు తోకముడిచారు.

ఇరుపక్షాల మధ్య రాత్రి 11 గం.ల వరకు ఎదురుకాల్పులు కొనసాగినట్లు భారత సైనిక అధికారవర్గాలు తెలిపాయి. అదృష్టవశాత్తు పాక్ కాల్పుల్లో భారత సేనలు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కొత్త సంవత్సరాది రోజునే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించడం ద్వారా పాక్ తోక వంకర అనే విషయాన్ని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది.

ఇది కూడా చదవండి..

First published: January 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు