కష్టాల్లో పాకిస్తానీ హిందూ శరణార్థి బాలిక..

దామి కోహ్లి(Image : ANI)

పాకిస్తాన్‌లో పదో తరగతి వరకు చదువుకున్న ఆ బాలిక స్థానికంగా ఓ స్కూల్లో అడ్మిషన్ పొంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ రెండో సవంత్సరం పరీక్షలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న సమయంలో.. ఎలిజిబిలిటీ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని విద్యాశాఖ నోటీసులు జారీ చేయడంతో ఆమె ఆందోళన చెందుతోంది.

 • Share this:
  దామి కోహ్లి అనే ఓ పాకిస్తానీ హిందూ శరణార్థి బాలికను ఎలిజిబిలిటీ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిందిగా రాజస్తాన్ విద్యాశాఖ కోరింది. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు హాజరవాలంటే ఎలిజిబిలిటీ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిందేనని చెప్పింది. దీంతో తన చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని ఆ బాలిక దిగులు చెందుతోంది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి కుటుంబంతో పాటు వలస వచ్చిన దామి కోహ్లి.. ప్రస్తుతం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌కు 20కి.మీ దూరంలో ఉన్న ఆంగన్వ శరణార్థి శిబిరంలో నివసిస్తోంది. పాకిస్తాన్‌లో పదో తరగతి వరకు చదువుకున్న దామి స్థానికంగా ఓ స్కూల్లో అడ్మిషన్ పొంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ రెండో సవంత్సరం పరీక్షలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న సమయంలో.. ఎలిజిబిలిటీ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని విద్యాశాఖ నోటీసులు జారీ చేయడంతో ఆమె ఆందోళన చెందుతోంది.

  2018లో ఇక్కడి స్కూల్లో అడ్మిషన్ పొందాను. మొదటి సంవత్సరం కష్టపడి చదవి 11వ తరగతి ఉత్తీర్ణత సాధించాను. నా దగ్గర ఆ మార్కుల షీట్ కూడా ఉంది. ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలకు మో నెల రోజులు మాత్రమే గడువు ఉంది. ఇలాంటి తరుణంలో ఎలిజిబిలిటీ పత్రాలు సమర్పించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. లేనిపక్షంలో పరీక్షలకు అనుమతించమని చెప్పారు. విద్యాశాఖ కోరిన అన్ని ధ్రువీకరణ పత్రాలను తాను సమర్పించాను. కాబట్టి పరీక్షలు రాసేందుకు తప్పకుండా అనుమతి వస్తుందని ఆశిస్తున్నాను.
  దామి కోహ్లి,శరణార్థి బాలిక


  రాజస్తాన్ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతసరా మాట్లాడుతూ.. ఆ బాలిక విద్యా వివరాలు, అక్కడి సిలబస్ వివరాలను కోరుతూ పాకిస్తాన్ దౌత్య కార్యాలయానికి లేఖ రాసినట్టు తెలిపారు. ఇక్కడి సిలబస్‌ను అక్కడి సిలబస్‌తో పోల్చి చూసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ నుండి సానుకూల స్పందన వస్తే బాలికను తప్పకుండా పరీక్షలకు అనుమతిస్తామని చెప్పారు.
  Published by:Srinivas Mittapalli
  First published: