హోమ్ /వార్తలు /జాతీయం /

పాక్ సంచలన నిర్ణయం : జైషే చీఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి సమ్మతి?

పాక్ సంచలన నిర్ణయం : జైషే చీఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి సమ్మతి?

ఐరాస సభ్యదేశాల నుంచి జైషే మహ్మద్ సంస్థకు వచ్చే నిధులకు అడ్డుకట్ట పడుతుంది.

ఐరాస సభ్యదేశాల నుంచి జైషే మహ్మద్ సంస్థకు వచ్చే నిధులకు అడ్డుకట్ట పడుతుంది.

Pak May Withdraw Its Opposition to List Masood Azhar as Global Terrorist : ఇప్పటిదాకా మసూద్ అజర్‌ను వెనకేసుకొస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న నింద మోస్తున్న పాక్.. ఇకపై తన విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మసూద్ అజర్‌ను హౌజ్ అరెస్ట్ లేదా కస్టడీలోకి తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

  జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మృతిపై అనేక ఊహాగానాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. మసూద్ అజర్ చనిపోయాడని కొన్ని కథనాలు చెబుతుంటే.. లేదూ, జైషే మహమ్మద్ వర్గాలు మసూద్ ఇంకా బతికే ఉన్నాడని చెబుతున్నాయంటూ మరికొన్ని కథనాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. ఇన్నాళ్లు మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు నిరాకరిస్తూ వస్తున్న పాకిస్తాన్.. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.


  పాక్ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు పాకిస్తాన్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ తన నిర్ణయం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా మసూద్ అజర్‌ను వెనకేసుకొస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న నింద మోస్తున్న పాక్.. ఇకపై తన విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మసూద్ అజర్‌ను హౌజ్ అరెస్ట్ లేదా కస్టడీలోకి తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.


  మసూద్ అజర్ ముఖ్యమా..? దేశ ప్రయోజనాలు ముఖ్యమా..? అన్న కోణంలో ఆలోచిస్తున్న పాకిస్తాన్.. రెండో ఆలోచనకే మొగ్గుచూస్తున్నట్టు సమాచారం. ఒక్క జైషే మహమ్మద్ పైనే కాకుండా దేశంలో తిష్ట వేసిన అన్ని ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాక్ భావిస్తున్నట్టు The Express Tribune వెల్లడించింది. అయితే ఇదంతా కార్యరూపం దాలుస్తుందా లేక ఊహాగానాలకే పరిమితమవుతుందా అన్న విషయంలోనూ స్పష్టత లేదు.


  వీటో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్,బ్రిటన్ ఇటీవలే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాసకు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను 10 రోజుల్లో ఐరాస పరిశీలించనుంది. గత పదేళ్లలో మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐరాసకు ప్రతిపాదన పంపించడం ఇది నాలుగోసారి. పుల్వామా దాడి తర్వాత భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి ఈ ప్రతిపాదన తెర పైకి వచ్చింది. దీంతో అటు పాకిస్తాన్‌పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు పాక్ సుముఖంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

  First published:

  Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Narendra modi, Pakistan, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు