Home /News /national /

PAK DRONES ARMS AMMUNITION DROPPED BY PAKISTANI DRONE RECOVERED IN JAMMU KASHMIR SK

Pak Drones: డ్రోన్‌లో తుపాకులు, బాంబులు పంపించిన పాక్.. అంతర్జాతీయ సరిహద్దు వద్ద తీవ్ర కలకలం

డ్రోన్లో పంపిన ఆయుధాల స్వాధీనం

డ్రోన్లో పంపిన ఆయుధాల స్వాధీనం

పాకిస్తాన్  బోర్డర్‌లోని టోఫ్ గ్రామంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఓ డ్రోన్ కేసులో అరెస్టైన నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని సీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    జమ్మూకాశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఎల్‌వోసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ (BSF), ఆర్మీ (Indian Army) నిఘాను పెంచింది. సాయుధ బలగాలు నిరంతరం పహారా కాస్తూ చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తున్నాయి. సరిహద్దు వెంబడి భద్రత పెరగడంతో పాకిస్తాన్ రూటు మార్చింది. టెక్నాలజీని ఉపయోగించి.. భారత్‌లో విధ్వంసాలకు కుట్ర చేస్తోంది.  గతంలో మనుషుల ద్వారా బాంబులు, ఇతర ఆయుధాలను పంపించేది. ఇప్పుడు డ్రోన్ల ద్వారా ఆయుధాలను పంపిస్తోంది. తాజాగా పాకిస్తాన్  బోర్డర్‌లోని టోఫ్ గ్రామంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఓ డ్రోన్ కేసులో అరెస్టైన నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని సీజ్ చేశారు.

     Rajinikanth: రజనీకాంత్‌కు గవర్నర్ పదవి..? ఇక సినిమాలకు గుడ్‌బై.. బీజేపీ స్కెచ్ ఇదేనా..

    జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రికవరీ చేయడంపై ఆర్నియా పోలీస్ స్టేషన్‌లో 24 ఫిబ్రవరి 2022న ఓ కేసు నమోదైంది. ఇందులో జమ్మూకు చెందిన స్థానికుడు నిందితుడిగా ఉన్నాడు. పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా పంపిన ఆయుధాలను అతడే పికప్ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో కీలక విషయాలు తెలిశాయి. పాకిస్తాన్ తరపున డ్రోన్‌లను కూల్చివేయడం, ఆయుధాలను తరలించడంలో పాకిస్థానీ ఖైదీ/హ్యాండ్లర మహ్మద్ అలీ హుస్సేన్ అలియాస్ ఖాసిం కీలకపాత్ర పోషించాడని తెలిపాడు. ఖాషీ లష్కరే తోయిబా (LeT), అల్ బదర్‌ల ప్రధాన కార్యకర్త అని వెల్లడించాడు. పాకిస్తాన్ వైపు నుంచి అర్నియా గ్రామంలో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడుస్తారని.. వాటిని సేకరించడంలో తన పాత్ర ఉందని అంగీకరించాడు.

    అర్నియా గ్రామంలో ఏయే ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలను జార విడుస్తారో పోలీసులు కూపీ లాగారు. అనంతరం అతడు చెప్పిన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. తనిఖీలు చేశారు. అతను మొదట చెప్పిన ప్రదేశంలో ఎలాంటి ఆయుధాలు దొరకలేదని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఐతే అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఫాలియన్ మండలం టోఫ్ గ్రామం సమీపంలో ఓ నలుపు రంగు ప్యాకెట్ లభ్యమైందని అన్నారు. దాన్ని తెరిచి చూస్తే.. భారీగా ఆయుధాలు దొరికాయి. అందులో తుపాకి, మందుగుండు సామగ్రి, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే ప్యాకెట్ తెరుస్తున్న సమయంలో నిందితుడు పోలీస్‌ అధికారిపై దాడి చేసి సర్వీస్ రైఫిల్ లాక్కున్నారు. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో అతడికి గాయాలయ్యాయి. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఉగ్రవాది చనిపోయాడు.



    డ్రోన్ నుండి పంపిన ప్యాకెట్‌ను తెరవడానికి పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను ఉపయోగించారు. AK-47 రైఫిల్, మ్యాగజైన్, 40 AK రౌండ్, ఒక స్టార్ పిస్టల్, పిస్టల్ రౌండ్, చైనీస్ గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. సరిహద్దు వెంబడి డ్రోన్ల కార్యకలాపాలు పెరగడంతో వాటిపై గట్టి నిఘా పెట్టామని పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jammu and Kashmir, Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు