హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Breaking News: అమిత్ షాకు గిఫ్ట్ గా డీజీపీ హత్య..సంచలనంగా మారిన ఆ సంస్థ ప్రకటన

Breaking News: అమిత్ షాకు గిఫ్ట్ గా డీజీపీ హత్య..సంచలనంగా మారిన ఆ సంస్థ ప్రకటన

డీజీపీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హేమంత్ కుమార్ జమ్మూకాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉదయ్ వాలాలోని ఆయన ఇంట్లోనే గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు.

డీజీపీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హేమంత్ కుమార్ జమ్మూకాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉదయ్ వాలాలోని ఆయన ఇంట్లోనే గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు.

డీజీపీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హేమంత్ కుమార్ జమ్మూకాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉదయ్ వాలాలోని ఆయన ఇంట్లోనే గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Jammu and Kashmir, India

  డీజీపీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హేమంత్ కుమార్ జమ్మూకాశ్మీర్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఉదయ్ వాలాలోని ఆయన ఇంట్లోనే గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ హత్య అనంతరం ఆ ఇంట్లో పని చేసే జసిర్ అనే వ్యక్తి కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అతనే ప్రధాన నిందుతుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి PAFF అనే ఉగ్రవాద సంస్థ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మేము తలుచుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా దాడి చేయగలం. మా స్పెషల్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇది చిరు కానుక అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

  ఈ ఘటనపై జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ ముకేశ్ సింగ్ (Mukesh singh) మాట్లాడుతూ..1992 బ్యాచ్ కు చెందిన హేమంత్ ఇటీవల పదోన్నతి పొంది జమ్మూకాశ్మీర్ జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టారు. సోమవారం రాత్రి హేమంత్ కాలు వాచిందని ఏదో నేను రాసుకున్నారు. అదే సమయంలో ఆయనకు ఊపిరి ఆడకుండా చేసి సీసాతో గొంతు కోశాడు. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మంటలను గమనించిన భద్రతా సిబ్బంది డీజీపీ గది తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే ఆయనకు తీవ్ర రక్థస్రావం కావడంతో మృతి చెందారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే కొన్ని క్లూస్ దొరికాయి. అయితే ఆ ఇంటి పనిమనిషి కనపడకుండా పోవడం అనుమానానికి తావిస్తోంది. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ ముకేశ్ సింగ్ తెలిపారు.

  అయితే ఈ ఘటనకు సంబంధించి పని మనిషిపైనే అందరికి అనుమానం ఉండగా ఇంతలో PAFF (పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్) ప్రకటన సంచలనానికి తెరదీసింది. ఈ ఆపరేషన్ మా స్పెషల్ స్క్వాడ్ పూర్తి చేసింది. మేము తలచుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడగలం. త్వరలో మరిన్ని ఆపరేషన్లు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రకటనపై జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ స్పందించారు. ఇది PAFF సంస్థ పని కాదు. ఆ ఇంట్లో పని చేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నాం. ఇప్పటివరకు పని మనిషే ప్రధాన నిందితుడు. అతని ప్రవర్తన దురుసుగా వుండేదని అలాగే  కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నాం. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపడతాం అని ముకేశ్ సింగ్ తెలిపారు.

  అసలు PAFF అంటే ఏంటి?

  PAFF (పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్) అనేది ఉగ్రవాద సంస్థ. భారత్ లో భారీ స్థాయిలో దాడులకు పాల్పడుతామని ఇటీవల హెచ్చరిస్తూ వస్తుంది. అలాగే డిసెంబర్ లో జమ్మూకాశ్మీర్ లో జరగబోయే జీ20 సదస్సును జరగబోనియమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజా దాడి ఉగ్రవాదుల పనా? లేక ఇంటి పని మనిషే ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనేది సస్పెన్స్ గా మారింది.

  అమిత్ షా పర్యటనపై సందిగ్ధత

  కేంద్ర హోం మంత్రి అమిత్ షా 3 రోజుల పాటు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. మంగళవారం ఆయన పర్యటన ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో డీజీపీ దారుణ హత్య చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. దీనితో అమిత్ షా పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు