Roddam Narasimha: ప్రముఖ సైంటిస్ట్ రొడ్డం నరసింహ కన్నుమూత. ఆ సేవలు అపూర్వం

ప్రముఖ సైంటిస్ట్ రొడ్డం నరసింహ కన్నుమూత. ఆ సేవలు అపూర్వం (image credit - twitter - Nirad Mudur)

Roddam Narasimha: ఎవరీ రొడ్డం నరసింహ... ఆయనకూ ఇస్రో (ISRO)కీ సంబంధమేంటి? ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?

 • Share this:
  Roddam Narasimha: ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ (NAL) మాజీ డైరెక్టర్, ఫ్రొఫెసర్ రొడ్డం నరసింహ (87) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ భార్య, ఓ కూతురు. మెదడులో రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని డిసెంబర్ 6న బెంగుళూరులోని MS రామయ్య ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రొఫెసర్ కన్నుమూశారు. ఆయన కరోనాతో చనిపోయారన్న వార్తలను ఖండించిన డాక్టర్లు... ఆయనకు కరోనా సోకలేదని తెలిపారు. 1933లో జన్మించిన ప్రొఫెసర్ నరసింహ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... 2013లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది.


  ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా నరసింహ భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన మైసూర్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)కి ఫ్యాకల్టీగా పని చేశారు. 1983-1984లో IIScలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత... NAL మూడో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984-1993 మధ్య ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన... ఆ తర్వాత NAL ల్యాబొరేటరీ అఫిలియేట్ అయిన CSIRకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అది పౌర విమానయాన రంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన ల్యాబొరేటరీ. ఇందులో సివిల్ ఏవియేషన్, పారలెల్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్, సర్ఫేస్ టెక్నాలజీస్, కాంప్యుటేషనల్ ఫ్ల్యూయిడ్ డైనమిక్స్ వంటివి విభాగాలున్నాయి. నరసింహ... ఇస్రో తేలికపాటి యుద్ద విమానాల (Light Combat Aircraft (LCA) నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మొదటి విద్యార్థి ఈయనే. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని అత్యున్నత సైంటిస్ట్‌గా ఎదిగారు. పద్మ విభూషణ్‌తోపాటూ... భట్నాగర్ అవార్డు కూడా అందుకున్నారు.


  దేశీయంగా ఫైటర్ జెట్ల తయారీ జరుగుతున్న సమయంలో... తేజాస్ యుద్ధ విమాన తయారీలో నరసింహ పాల్గొన్నారు. 1997-2004 మధ్య ఆయన... నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కి డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే... 2012లో స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో 30 కోట్ల డాలర్ల యాంత్రిక్స్-దేవాస్ డీల్‌ వివాదాస్పదం కావడంతో... సైంటిస్టులకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను ఖండిస్తూ... స్పేస్ కమిషన్ సభ్యత్వ పదవికి రాజీనామా చేయాలనుకున్నారు. అంతకు ఏడాది ముందు... ఈ యాంత్రిక్స్-దేవాస్ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ డీల్‌ని రివ్యూ చేసేందుకు ఏర్పాటుచేసిన హైపవర్ రివ్యూ కమిటీలో నరసింహను కూడా సభ్యుడిగా కేంద్రం నియమించింది.

  ఇది కూడా చదవండి:Black Coffee: బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ ఎందుకు తాగాలి... 4 కారణాలు

  జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో ఫ్యాకల్టీగా కూడా పనిచేసిన ప్రొఫెసర్ నరసింహ... అనేక ఏరోస్పోస్ కాన్ఫరెన్సులు, సెమినార్లలో పాల్గొని... యువతకు దిశా నిర్దేశం చేశారు.
  Published by:Krishna Kumar N
  First published: