Home /News /national /

PADMA AWARDS CEREMONY AT RASHTRAPATI BHAVAN PRESIDENT RAM NATH KOVIND PRESENTS AWARDS PM MODI ATTENDS MKS

Padma Awards ceremony : రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం -హాజరైన ప్రధాని మోదీ

రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం స్వీకరిస్తోన్న నటి కంగనా రనౌత్

రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం స్వీకరిస్తోన్న నటి కంగనా రనౌత్

పద్మ అవార్డుల ప్రధానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్ లో వేడుకలా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. అవార్డీలను సత్కరిస్తూ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
భారత్ లో ఉన్నత పౌరసత్కారాలుగా భావించే పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్ లో వేడుకలా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. అవార్డీలను సత్కరిస్తూ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అవార్డీలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికిగానూ  ఈఏడాది జనవరిలో పద్మ అవార్డులను ప్రకటించగా, ఇవాళ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈసారి 119 మందికి పద్మ అవార్డులు దక్కాయి. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.  తెలుగు సినీ గాయకుడు, గత ఏడాది సెప్టెంబర్ 25న కరోనాతో తుది శ్వాస విడిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. మరణానంతరం అరుణ్‌ జైట్లీకి పద్మ విభూషన్‌, సుష్మా స్వరాజ్‌కు పద్వ భూషన్‌ను ప్రకటించారు.

పురస్కారం స్వీకరించిన పీవీ సింధు


తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు పద్మ భూషన్‌ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. బాలీవుడ్‌ నటికి కంగనా రనౌత్‌ పద్మశ్రీ పురస్కారం అందుకుంటోన్న సమయంలో దర్బార్ హాలులో చప్పట్లు మోగాయి. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌, సింగర్‌ అద్నాన్‌ సమీ, నిర్మాత కరణ్ జోహర్ సైతం పద్మశ్రీ పురస్కారం పొందారు. అందుకున్నారు.

పద్మశ్రీ అద్నాన్ సమీ


ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్ రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఏపీ నుంచి అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కనకరాజును కళారంగంలో పద్మశ్రీ వరించింది.

పద్మ అవార్డుల ప్రదానం


పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీతలు:
1) షింజో అబే (జపాన్‌ మాజీ ప్రధాని)
2) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాయకుడు, తమిళనాడు
3) బెల్లె మోనప్ప హెగ్డే, వైద్య రంగం, కర్ణాటక
4) నరీందర్‌ సింగ్‌ కపానీ, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, అమెరికా‌
5) మౌలానా వహిదుద్దీన్‌ ఖాన్‌, ఆధ్యాత్మికత, ఢిల్లీ
6) బీబీ లాల్‌, ఆర్కియాలజీ, ఢిల్లీ
7) సుదర్శన్ సాహూ, ఆర్ట్, ఒడిషా
Published by:Madhu Kota
First published:

Tags: Padma Awards, Pm modi, President of India, Ramnath kovind

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు