• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • OXYGEN SHORTAGE IN DELHI FEW HOSPITALS MAY BE CLOSED VS

oxygen shortage : ఆక్సిజన్ లేక ఢిల్లీ ఆసుపత్రులు విలవిల.. ప్రాణాలు కాపాడలేకపోతున్నామంటూ డాక్టర్ల ఆవేదన

oxygen shortage : ఆక్సిజన్ లేక ఢిల్లీ ఆసుపత్రులు విలవిల.. ప్రాణాలు కాపాడలేకపోతున్నామంటూ డాక్టర్ల ఆవేదన

ప్రతీకాత్మక చిత్రం

Delhi ఆక్సిజన్ లేక ఢిల్లీ ఆసుపత్రులు విలవిలలాడుతున్నాయి. ప్రముఖ ప్రవైటు ఆసుపత్రుల్లో సైతం పూర్తిగా ఆక్సిజన్ లేకపోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది..మరి కొన్ని ఆసుపత్రుల్లో కూడ కొన్ని గంటల మేర మాత్రమే సరిపడ ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

  • Share this:
Delhi ఆక్సిజన్ లేక ఢిల్లీ ఆసుపత్రులు విలవిలలాడుతున్నాయి. ప్రముఖ ప్రవైటు ఆసుపత్రుల్లో సైతం పూర్తిగా ఆక్సిజన్ లేకపోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది..మరి కొన్ని ఆసుపత్రుల్లో కూడ కొన్ని గంటల మేర మాత్రమే సరిపడ ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మనిషి ఆయువుగా ఉన్న ఆక్సిజన్ కోరత మరింత తీవ్రమైంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా లేక అనేక అసుపత్రులు తలలు పట్టుకుంటున్నాయి. దీంతో సరఫరా ఉన్న రాష్ట్ర్రాల్లో డబుల్ రేట్లతో రోగులను నిండా ముంచుతున్నారు. ఇక ఆక్సిజన్ కోరత ఢిల్లీని మొదటి నుండి వేధిస్తోంది. ఆక్సిజన్ కోరతతో రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏమేరకు విషమించిందో అర్థం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో కొన్ని ఆసుపత్రులు వైద్యం చేయలేక చేతులెత్తడంతో పాటు వైద్య వృత్తిలో ఉన్నందుకు ప్రజల ప్రాణాలను కాపాడలేకపోతున్నామనే ఆవేదనను వ్యక్తం చేస్తూ..కంటతడి పెడుతున్న సంఘటనలు నెలకొన్నాయి.

ఆక్సిజన్ కొరత దేశాన్ని పట్టి పీడిస్తుందనే చెప్పాలి. కరోనా సమయంలో కనీస అవసరమైన ఆక్సీజన్ సిలిండర్స్ లేక అనేక మంది కరోనా భారిన పడ్డవారు ప్రాణాలు వదిలిపెడుతున్న పరిస్థితి నెలకోంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఏకంగా ప్రధాని మోడి శుక్రవారం ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారంటే ఏమేరకు ఆక్సిజన్ కొరత ఉందో అర్థం చేసుకోవచ్చు..

అయితే ఆక్సిజన్ కొరత దేశరాజధాని ఢిల్లీలో మరింత తీవ్రంగా తయారైంది. దీంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆక్సిజన్ లేక కొవిడ్ పేషంట్లకు వైద్యం అందించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరు ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉందని ఏకంగా ఢిల్లీ ప్రభుత్వమే ప్రకటించింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం పక్క రాష్ట్ర్రాల నుండి ఆక్సిజన్ తెప్పించుకునేందుకు తీవ్ర కృషి చేస్తోంది. కాగా ఆక్సిజన్ కొరత పై కొంతమంది డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటీ పరిస్థితి రావడంపై వారు కంటతడి పెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఢిల్లీ వస్తున్న ఆక్సిజన్ వాహానాలు పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రం అడ్డుకోవడం తెలిసిందే..దీంతో పరిస్థితి మరింత విషమించింది.

మొత్తం మీద ఢిల్లీ పరిస్థితులపై ఆసుపత్రుల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేయడం అక్కడి పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం గంటలకు సరిపడేంత మాత్రమే ఉండడడంతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సమస్య పరిష్కారానికి మోడి నడుం బిగించారు. అయితే రేపటి ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో జరిగే సమావేశంలో ఏమేరకు పరిష్కారం అవుతుందో వేచిచూడాలి.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు