నంబర్ ప్లేట్‌పై కులం పేరా? వాహన యజమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు

వాహనాలపై కులం పేర్లు రాసుకోవడం,రెచ్చగొట్టే రీతిలో కొటేషన్స్ ముద్రించడం ప్రజలను అభద్రతా భావానికి గురిచేయడం,న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటి వాటికి దారితీస్తుందని గౌతమ్ బుద్దనగర్ ఎస్పీ వైభవ్ కృష్ణ అన్నారు.

news18-telugu
Updated: October 26, 2019, 4:32 PM IST
నంబర్ ప్లేట్‌పై కులం పేరా? వాహన యజమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాహనాల నంబర్ ప్లేట్లపై 'కులం' పేర్లను ముద్రించుకున్నవారికి నోయిడా పోలీసులు షాక్ ఇచ్చారు. కులం పేర్లతో పాటు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలను నంబర్ ప్లేట్లపై ముద్రించుకున్నవారికి భారీ చలానాలు విధించారు.శుక్రవారం గౌతమ్ బుద్దనగర్‌ జిల్లాలో ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో నంబర్ ప్లేట్లపై కులం పేర్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ముద్రించిన 250 వాహనాలను గుర్తించారు.ఇందులో 133 వాహనాలపై కులం పేర్లు ముద్రించి ఉండగా.. మిగతా వాహనాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు రాసినట్టుగా గుర్తించారు. ఇందులో బైక్స్‌తో పాటు ఇతర వాహనాలు కూడా ఉన్నాయి.వాహనాలపై కులం పేర్లు రాసుకోవడం,రెచ్చగొట్టే రీతిలో కొటేషన్స్ ముద్రించడం ప్రజలను అభద్రతా భావానికి గురిచేయడం,న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటి వాటికి దారితీస్తుందని గౌతమ్ బుద్దనగర్ ఎస్పీ వైభవ్ కృష్ణ అన్నారు. అందుకే ఇలాంటి చర్యలను ఉపేక్షించట్లేదన్నారు. ఇకముందు కూడా ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. కాగా, కాలనీలతో పాటు పలు బంగారం షాపులు,పెట్రోల్ బంక్స్,మార్కెట్స్ లాంటి ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచినట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.

First published: October 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు