హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Devotion: కోట్ల ఆస్తి.. 30 ఏళ్లుగా నడుస్తూనే ప్రతీ ఊరూ తిరుగుతున్నాడు.. ఎందుకో తెలుసా?

Devotion: కోట్ల ఆస్తి.. 30 ఏళ్లుగా నడుస్తూనే ప్రతీ ఊరూ తిరుగుతున్నాడు.. ఎందుకో తెలుసా?

ధ్రువదాస్ మహరాజ్

ధ్రువదాస్ మహరాజ్

కోట్ల ఆస్తి ఉన్నా.. బిల్డింగ్‌లు, బొలెరాలున్నా.. ఆయన 30ఏళ్లుగా డుస్తూనే ప్రతీ ఊరూ తిరుగుతున్నాడు.. ఎందుకో తెలుసా?

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఏ మనిషికైనా కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. మిగిలిన సమయాల్లో మాత్రం అసలు గుర్తుకే రాడు.. జీవితమంతా హ్యాపీగా సాగిపోతే.. ఎలాంటి ఇబ్బంది లేకపోతే దేవుడిని పట్టించుకోని మనుషులే ఎక్కువ.. అయితే కొందరు మాత్రం నిజంగా దేవుడి కోసమే బతుకుతారు.. దేవుడి కోసమే జీవిస్తారు.. దేవుడే ఊపిరిగా.. భగవంతుడే సర్వంగా.. చేసే ప్రతీ పనిలోనూ ఆ పరమాత్ముడిని చూసుకుంటారు.. కోట్ల ఆస్తి ఉన్నా.. బిల్డింగ్‌లు, బొలెరాలున్నా దేవుడి కోసం అన్ని వదులుకునే సన్యాసులూ ఉంటారు.. అలాంటి ఓ బాబానే ధ్రువదాస్ మహరాజ్ .. ఆయన 30ఏళ్లుగా డుస్తూనే ప్రతీ ఊరూ తిరుగుతున్నాడు.. ఎందుకో తెలుసా?

చిన్నతనంలోనే తల్లి మృతి:

ఉత్తర ప్రదేశ్‌లోని సాహిర్ ఔరయాకు చెందిన ధ్రువదాస్ బాబా 30ఏళ్లుగా కాలినడకన తీర్థయాత్రలు చేస్తున్నారు. మహరాజ్ దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శించారు. ఆయన అడుగు పెట్టని చోటు లేదంట. నిజానికి ధృవదాస్ మహారాజ్ తల్లి చిన్నతనంలోనే చనిపోయారు. దీంతో తల్లి ప్రేమను పొందలేక చాలా బాధపడ్డారు ధ్రువదాస్‌. అయితే బాధను తట్టుకునేందుకు ఆయన దేవుడిని ప్రేమించడం మొదలుపెట్టారు. 30ఏళ్లుగా పాదయాత్ర చేస్తూ దేశంలోని వేల ఆలయాలను ఆయన సందర్శించారు. తాజాగా ఆయన మధ్యప్రదేశ్‌లోని భిండ్‌కు చేరుకున్నారు.

కోట్ల ఆస్తి.. అన్ని వదులుకోని:

ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతోంది.. అయితే ఎంత డబ్బున్నా మన:శాంతి లేకపోతే అదంతా వ్యర్థమే.. చాలా మంది ఎన్నీ కోట్లున్నా ఆనందంగా గడపలేరు.. ధ్రువదాస్‌కు కూడా కోట్ల రూపాయల ఆస్తి ఉంది. 1100 బిఘాల భూమి ఉంది.. అయితే ఇదంతా ఆయన అనుభవించడలేదు.. తీర్థయాత్రల కోసమే ఆయన తన జీవితాన్ని అంకీతం చేశారు. ఆయన తన వెంట ఓ డైరీని తెచ్చుకుంటారు. అదే అతని బెస్ట్ ఫ్రెండ్‌. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మహారాజ్ ఎక్కడ ఆగినా, ఎక్కడ తిన్నా, ఏం తాగినా.. ప్రతి విషయాన్ని డైరీలో రాసుకుంటారు. మహారాజ్ గుడికి వెళ్లి అదే డైరీని దేవుడి ముందు పెడతారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భిండ్‌లో ఉన్న ఆయన అక్కడి నుంచి ఖతుశ్యామ్‌కు వెళ్తారు. అక్కడి నుంచి కాలినడకన అయోధ్య నగరానికి వెళ్తారు. దారిలో ఏ ఆలయం ఎక్కడ కనిపించినా.. అక్కడే ఆగిపోతారు. మహరాజ్ ఎప్పుడూ వాహనంలో ప్రయాణించరు. ఇక ఫుడ్‌ కూడా కొనుక్కోరు.. ఎవరు ఏదీ ఇస్తే అది తీసుకొని తింటారు.. లేకపోతే ఆకలితోనే ఉంటారట

First published:

Tags: Temples, Uttar pradesh