• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • OWN A TV OR FRIDGE OR 2 WHEELER IN KARNATAKA SURRENDER BPL RATION CARD OR FACE ACTION SU

Ration Card: టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నాయా.. అయితే రేషన్ కార్డు వదులుకోవాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

పేద ప్రజలకు జారిచేసిన రేషన్ కార్డులకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నవారు.. స్వచ్ఛందంగా రేషన్ కార్డును వదులుకోవాలని ప్రజలను కోరింది.

  • Share this:
    పేద ప్రజలకు జారిచేసిన రేషన్ కార్డులకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నవారు.. స్వచ్ఛందంగా రేషన్ కార్డును వదులుకోవాలని ప్రజలను కోరింది. ఆ వస్తువులు కలిగి ఉన్నవారు మార్చి 31 లోపు రేషన్ కార్డులను ప్రభుత్వానికి అప్పజెప్పాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి అన్నారు. లేకుంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు బెల్గావిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. "పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడానికి కొన్ని పరిమితులుంటాయి. బీపీఎల్ రేషన్ కార్డు తీసుకునేవారికి ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. టీవీ, ఫ్రిజ్‌, బైక్ వంటి వస్తువులు ఉండకూడదు. ఈ వస్తువులు కలిగిఉన్న వారు రేషన్ కార్డులు తిరిగి ఇచ్చేయాలి. ఏడాదికి రూ. 1.20 లక్షల కన్నా ఆదాయం కలిగి ఉన్నవారు ఈ రేషన్ కార్డులు వినియోగించకూడదు. ఇలాంటివారు మార్చి 31 లోపు రేషన్ కార్డులను సరెండర్ చేయాలి" అని అన్నారు.

    మంత్రి ఉమేశ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే బెంగళూరులోని వివిధ రేషన్ షాపుల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాయి. అలాగే రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.

    కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఖాదర్ మాట్లాడుతూ.. "కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విషయం తమ ముందుకు వచ్చిందని.. అయితే రేషన్ కార్డుల వల్ల ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ది జరుగుతున్నందుకు మేము ఆ నిర్ణయం తీసుకోలేదు. పాత నిబంధనలనే కొనసాగించాం. పేద ప్రజలు చాలా మంది వడ్డీ లేని రుణాల వంటి ఆఫర్ల ద్వారా ఫ్రిడ్జి, టీవీ, బైక్ వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రబుత్వం పేదల వ్యతిరేకి. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న రేషన్ కార్డులను తొలగించడానికి బదులుగా, వాటి లబ్దిదారుల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టాలి" అని ఆయన కోరారు.
    Published by:Sumanth Kanukula
    First published: