హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Travels Owner : టూరిస్ట్ బస్సులను కిలో రూ.45 చొప్పున అమ్మిన ట్రావెల్స్ యజమాని

Travels Owner : టూరిస్ట్ బస్సులను కిలో రూ.45 చొప్పున అమ్మిన ట్రావెల్స్ యజమాని

బస్సులను కిలో రూ.45 చొప్పున అమ్మిన ఓనర్

బస్సులను కిలో రూ.45 చొప్పున అమ్మిన ఓనర్

Tourist bus for Rs 45 per kg : మిగతా ట్రావెల్స్ కంపెనీల పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులకు సంబంధించి లోన్లు తిరిగి చెల్లించడానికి కొన్ని బస్సులను ఇదివరకే బ్యాంకులు, కంపెనీలు సీజ్ చేశాయి.

Tourist bus for Rs 45 per kg :  కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. భారత్‌ లోనూ ఎన్నో లక్షల కుటుంబాలు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయాయి. ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మరెంతో మంది ఉపాధిని కోల్పోయారు. కొన్ని రకాల వ్యాపారం చేసే వారు లాభాలు ఆర్జిస్తే, మరికొందరు వ్యాపారులు పూర్తిగా నష్టపోయి రోడ్డు మీద పడ్డారు.ముఖ్యంగా పర్యాటక రంగానికి కరోనా తీవ్ర నష్టాలను మిగిల్చింది. టూర్స్ అండ్ ట్రావెల్స్ పరిశ్రమపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపించింది. తమ బస్సులు కరోనా సమయంలో నడవక పోవడంతో ట్రావెల్స్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఓ ట్రావెల్స్ యజమాని తన బస్సులను తుక్కు కింద జమ చేస్తూ.. ఏకంగా కిలోల చొప్పున అమ్మ్కున్నాడు. హృదయాలను కదిలించే ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

కేరళకు చెందిన రాయ్‌ సన్ జోసెఫ్ కొచ్చి కేంద్రంగా రాయ్ అనే పేరుతో ట్రావెల్స్ సేవలు అందించేవారు. ఆయన వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 20 వరకు ఉండేవి. . టూరిస్టుల రాకతో సంస్థ లాభదాయకంగా నడిచేది. ఎప్పుడు బస్సులు పర్యాటకులతో నిండిపోయేవి. ఆ సంస్థ ద్వారా తనతో పాటు మరో 50 మందికి జోసెఫ్ ఉపాధినిచ్చేవాడు. అయితే కరోనా సమయంలో నిబంధనల కారణంగా ట్రావెల్స్ రంగానికి భారీ షాక్ తగిలింది. భారీగా నష్టపోయిన జోసెఫ్ ఇక బస్సులను భరించడం తన వల్ల కాదని ఇదివరకే 10 బస్సులను తుక్కు కింద విక్రయించాడు. కేవలం కేజీ రూ.45 చొప్పున తుక్కు కింద ట్రావెల్స్ బస్సులను అమ్మేశారు .కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కోవిడ్ నిబంధనలతో బస్సులను నడిపినా అసలు పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో బస్సులను స్క్రాప్ చేసి విక్రయించాడు.

ALSO READ Ganga water : కాశీలో నల్లగా మారిన గంగాజలాలు..నదీస్నానం చేయడానికి వీల్లేకుండా

తన వద్ద ఉన్న మిగతా బస్సులను సైతం కేజీ రూ.45కు విక్రయించాలని రాయ్‌ సన్ జోసెఫ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారని కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేషన్స్ అసోసియేషన్ కేరళ తెలిపింది. కరోనా వ్యాప్తి తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతూ రాయ్‌ సన్ జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని స్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జోసెఫ్ వెల్లడించాడు. ఇప్పుడు నడుస్తున్న బస్సుల రాబడి అంతంత మాత్రమే నని గత 21 రోజుల్లో కేవలం మూడు బస్సులు మాత్రమే మున్నార్ ట్రిప్ కు వెళ్లాయని.. చేసేది ఏమీ లేక ఇప్పుడు బస్సులను అమ్మకానికి పెట్టినల్టు చెప్పాడు. రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఒక్కో బస్సుకు రూ.40 వేల వరకు పన్నులు చెల్లించేవాడిని. పన్నులు, ఇన్సురెన్స్, ఇంధనం ఇలా మొత్తం ఒక్కో బస్సుకు రూ.80 వేలు చెల్లించాను. కానీ అధికారులు ఏదో ఓ కారణం చూపించి నా బస్సులను నిలిపివేస్తున్నారు. అందుకే బస్సులను అమ్మక తప్పడం లేదు"అని అన్నారు. అయితే కేరళలో మిగతా ట్రావెల్స్ కంపెనీల పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్టు తెలుస్తోంది. బస్సులకు సంబంధించి లోన్లు తిరిగి చెల్లించడానికి కొన్ని బస్సులను ఇదివరకే బ్యాంకులు, కంపెనీలు సీజ్ చేశాయి. కుటుంబాన్ని పోషించుకునేందుకు దిక్కు తోచని పరిస్థితుల్లో మిగతా బస్సులను కూడా స్క్రాప్ చేసి తుక్కు కింద విక్రయిస్తున్నారు.

First published:

Tags: Buses, Covid situation, Kerala, Travel

ఉత్తమ కథలు