ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్... 16కి చేరిన మృతుల సంఖ్య... ఇద్దరు భారతీయులు కూడా...

Mount Everest - Nepal : పర్వతం పైనుంచీ టూరిస్టులను వెనక్కు రప్పించేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 25, 2019, 6:19 AM IST
ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్... 16కి చేరిన మృతుల సంఖ్య... ఇద్దరు భారతీయులు కూడా...
ఎవరెస్ట్ పర్వతంపై ట్రాఫిక్ జామ్ (Image : Facebook / Nirmal Purja MBE: "Project Possible - 14/
  • Share this:
సాధారణంగా ఎవరెస్ట్ పర్వతం ఎక్కేటప్పుడు ఎదురయ్యే ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల పర్వతారోహకులు చనిపోతుంటారు. అలాంటిది ఈసారి మాత్రం ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవ్వడం వల్ల చనిపోయారు. దురదృష్టమేంటంటే... మృతుల సంఖ్య పెరుగుతోంది. అది ఆందోళన కలిగించే అంశం. అసలేమైందంటే... ఈ సంవత్సరం ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కేందుకు నేపాల్‌ ప్రభుత్వం 381 మందికి పర్మిషన్ ఇచ్చింది. వాళ్లంతా ఒక్కసారిగా పర్వతం దగ్గరకు వచ్చారు. నేను ముందంటే, నేను ముందు అంటూ పోటీ పడి పర్వతం ఎక్కారు. దాంతో ఎక్కిన వాళ్లు దిగలేక, ఎక్కని వాళ్లు ఎక్కలేక, ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అలా ఎంతసేపని ఉండగలరు. ఆ క్రమంలో చాలా మంది జారి పడిపోయి చనిపోతున్నారు.

everest,mount everest,mt everest,mount everest summit,mount everest (mountain),everest base camp,climbing everest,mount everest 2019,el everest,everet,everest inc,mt. everest,everest 2019,monte everest,everest movie,everest videos,everest photos,summit,rescate everest,everest sherpas,everest survival,mount everest top,everest basecamp,bodies of everest,summit of everest,view from everest,bodies on everest,mount everst,ఎవరెస్ట్, ఎవరెస్టు, పర్వతం, మృతులు, ట్రాఫిక్ జామ్, ఆక్సిజన్, నేపాల్, భారతీయులు మృతి, మంచు తుఫాన్,
ఎవరెస్ట్ పర్వతం (File)


ఓవైపు ట్రాఫిక్‌ జామ్ ఎక్కువవగా... దురదృష్టం కొద్దీ అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంచుతో కూడిన గాలులు ప్రాణాలు తీస్తున్నాయి. శిఖరాన్ని అధిరోహించి గురువారం మధ్యాహ్నం తిరిగి కిందకి వస్తున్న భారతీయ మహిళ కల్పనా దాస్‌(52) అనే చనిపోయారు. మరో భారతీయుడు నిహాల్‌ భగవాన్‌(27) కూడా అదే విధంగా మృతిచెందారు. ఆయన కిందకి వస్తున్నప్పుడు దాదాపు 12 గంటల పాటూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. చివరకు చనిపోయారు.

ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలపై నేపాల్‌ పర్వతారోహణ సంస్థ అధ్యక్షుడు స్పందించాడు. వాతావరణ మార్పులు, డెత్‌ జోన్లలో ఎక్కువ సేపు ఉండటం వల్ల పర్వతారోహకులు అనారోగ్యం చెంది చనిపోతున్నారని అన్నారు. ఆయన చెప్పింది వంద శాతం నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం దగ్గర వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. క్షణక్షణం అది మారిపోతూ ఉంటుంది. దానికి తోడు ఆక్సిజన్ అందదు. కళ్లు సరిగా కనపడవు. తలనొప్పి వస్తుంది. నిద్ర పట్టదు. మాటిమాటికీ ఇసుక తుఫాను లాగా మంచు తుఫానులు వస్తూ... నరకం చూపిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి విపరీత వాతావరణమే అక్కడ ఉంది. అందుకే అంత మంది చనిపోతున్నారని అనుకోవచ్చు.
First published: May 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading