Bihar Lineman Revange : టూ వీలర్ నడుపుతూ హెల్మ్ ట్ ధరించలేదన్న కారణంగా చలానా విధించారన్న కోపంతో ఏకంగా పోలీస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు ఓ లైన్ మ్యాన్. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది.
హాజిపుర్-మన్ హర్ మెయిన్ రోడ్డుపై స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో హాజిపుర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు చెందిన లైన్ మ్యాన్ సుమిత్ కుమార్ హెల్మెట్ లేకుండా బైక్ మీద వస్తుండగా.. ఎస్సై పుష్పకుమారి ఆపారు. హెల్మెట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించగా..తాను లైన్ మ్యాన్ అని, అందుకే హెల్మెట్ లేకుండా వెళ్తున్నట్లు పొంతనలేని సమాధానం ఇచ్చాడు సుమిత్. ఆ తర్వాత సుమిత్ కు వెయ్యి రూపాయలు చలానా విధించారు ఎస్సై. దీంతో చేసేదేమీ లేక చలానా డబ్బులు కట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే తనకు చలానా విధించడాన్ని మనసులో పెట్టకున్న సుమిత్.. కొద్దిసేపటి తర్వాత పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. దీంతో సెల్‌ఫోన్ టార్చీలతోనే విధులు నిర్వర్తించారు పోలీసులు. కొద్దిసేపటి తర్వాత స్టేషన్లో మాత్రమే విద్యుత్తు నిలిచిపోయిందని, మిగతా అంతటా కరెంట్ ఉందని గుర్తించారు.
ALSO READ Viral Video : అందమైన పెదాల కోసం.. సర్జరీకి వెళ్లిన టిక్ టాక్ స్టార్..సీన్ రివర్స్ అయి ఇప్పుడిలా
అప్పుడు పోలీసులకుఈ పని చేసింది సుమిత్ అని తెలిసింది. వెంటనే సుమిత్ ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే.. పై అధికారులు చెప్పడం వల్లే తాను స్టేషన్‌కు విద్యుత్ నిలిపివేశానని చెప్పాడు. అనంతరం కొద్దిసేపటి వాగ్వాదం తర్వాత లైన్ ను పునరుద్ధరించాడు సుమిత్. సుమిత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై విద్యుత్ విభాగానికి ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని మహిళా ఎస్సై పుష్పకుమారి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Police station, Power cuts