భోపాల్ రైల్వే స్టేషన్‌లో దుర్ఘటన...8 మంది ప్రయాణీకులకు గాయాలు

Bhopal Railway Station | భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ షెడ్ ప్రయాణీకులపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో రైలు కోసం ప్లాట్ ఫాంపై నిల్చొనున్న పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు.

news18-telugu
Updated: February 13, 2020, 12:29 PM IST
భోపాల్ రైల్వే స్టేషన్‌లో దుర్ఘటన...8 మంది ప్రయాణీకులకు గాయాలు
భోపాల్ లో కూలిపోయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి షెడ్
  • Share this:
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై షెడ్ కూలిపోయింది. గురువారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణీకులు గాయపడ్డారు. భోపాల్ రైల్వే స్టేషన్‌లోని మూడో నెంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాణీకులు రైలు కోసం వేచిచూస్తుండగా షెడ్ కూలి వారిపై పడింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు తేలికపాటి గాయాలే అయ్యాయని, ఎవరికీ ప్రాణహాని లేదని చెప్పారు.


ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Janardhan V
First published: February 13, 2020, 12:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading