• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • OVER 50 WOMEN AND CHILDREN STOOD BEFORE THE MLA AND HELD PLATES FILLED WITH RICE GRAINS AND TOOK HIS AARTI SSR

Tamilnadu Elections: ఎమ్మెల్యేకు లైఫ్‌లో మర్చిపోలేని వెల్‌కమ్ పలికిన మహిళలు.. ఆ పళ్లాల్లో ఏముందో చూసి..

Tamilnadu Elections: ఎమ్మెల్యేకు లైఫ్‌లో మర్చిపోలేని వెల్‌కమ్ పలికిన మహిళలు.. ఆ పళ్లాల్లో ఏముందో చూసి..

పళ్లాలతో ఎమ్మెల్యే కోసం మహిళల ఎదురుచూపులు

తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజవర్గానికి ఓట్లు అడిగేందుకు వెళ్లిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు ఓటర్లు ఊహించని విధంగా...

  • Share this:
    చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజవర్గానికి ఓట్లు అడిగేందుకు వెళ్లిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు ఓటర్లు ఊహించని విధంగా స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఊళ్లలో ఉండే కార్యకర్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఎమ్మెల్యేపై పూలు చల్లి మరీ మహిళలు స్వాగతం పలుకుతుంటారు.

    కానీ.. తమిళనాడులోని మధురై జిల్లా శోలవందన్ నియోజకవర్గ ఓటర్లు మాత్రం తమ ఎమ్మెల్యేకు చెంప పెట్టు లాంటి స్వాగతం పలికారు. వారి స్వాగతాన్ని చూసి సదరు ఎమ్మెల్యేకు నోట మాట రాలేదు. తెల్ల మొహం వేసిన ఎమ్మెల్యే బిక్కుబిక్కుమంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. శోలవందన్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే మాణిక్కం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని తాండలై గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలోకి ఎమ్మెల్యే అడుగుపెట్టగానే 50 మందికి పైగా మహిళలు, చిన్నారులు బియ్యపు పళ్లాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

    ఎమ్మెల్యే వస్తున్న సంగతి తెలిసి తమ ప్రాంతంలోని రేషన్ షాపుల నుంచి బియ్యాన్ని తీసుకొచ్చామని ఆ మహిళలు తెలిపారు. ఆ పళ్లాలలో ఉన్న బియ్యం నల్లగా, పసుపు రంగులో ఉన్నాయి. రేషన్‌లో ఎంత నాసి రకం బియ్యం ఇస్తున్నారో ఎమ్మెల్యేకు కళ్లకు కట్టినట్టు చూపించేందుకే తాము ఇలా స్వాగతం పలికామని, అంతే తప్ప తమకు ఎలాంటి ఉద్దేశం లేదని సదరు మహిళలు చెప్పారు. రేషన్‌లో బియ్యం అత్యంత నాసిరకంగా ఉంటున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేశామని, స్థానిక మున్సిపాలిటీ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని మహిళలు వాపోయారు. మేం కూడా వాళ్లలానే మనుషులమేనని, ఇలాంటి బియ్యాన్ని ఎలా తినగలమని వారు ప్రశ్నిస్తున్నారు.

    అంతేకాదు, ఆ మహిళలను ఓట్లడిగిన ఎమ్మెల్యేను గ్రామ ప్రజలు నిలదీశారు. మేం మీ పార్టీకి ఓట్లేస్తామని, కానీ మా ఊరికి మీరేం చేశారో చెప్పాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. ఐదేళ్ల తర్వాత ఎమ్మెల్యే మళ్లీ మా ఊరికి వచ్చారని, అసలు ‘ఈ ఊళ్లో వాటర్ పైప్ ఉందా.. సరైన రోడ్లు ఉన్నాయా.? ఈ రోడ్లపై మీ వాహనాలు సక్రమంగానే వచ్చాయా’? అని ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. గ్రామస్తులు నిలదీయడంతో ఏం చేయాలో పాలుపోని సదరు ఎమ్మెల్యే త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు