ఆన్‌లైన్‌లో వేలానికి ప్రధాని నరేంద్ర మోదీ గిఫ్ట్‌లు..మీరూ కొంటారా?

PM Narendra Modi | ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టేవాటిలో అతి తక్కువ ప్రారంభ ధర రూ.200 నుంచి..అత్యధిక ప్రారంభ ధర రూ.2.5 లక్షల వరకు ఉంటుందని సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.

news18-telugu
Updated: September 11, 2019, 5:57 PM IST
ఆన్‌లైన్‌లో వేలానికి ప్రధాని నరేంద్ర మోదీ గిఫ్ట్‌లు..మీరూ కొంటారా?
నరేంద్ర మోదీ(File)
news18-telugu
Updated: September 11, 2019, 5:57 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో అందుకున్న గిఫ్ట్‌లను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టనున్నారు. మొత్తం 2,772 గిఫ్ట్‌లను ఈ నెల 14 నుంచి వేలానికి పెట్టనున్నట్లు సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. వేలానికి పెట్టేవాటిలో అతి తక్కువ ప్రారంభ ధర రూ.200 నుంచి..అత్యధిక ప్రారంభ ధర రూ.2.5 లక్షల వరకు ఉంటుందని వివరించారు. వేలానికి పెట్టనున్నవాటిలో ప్రధాని మోదీ చిత్రపటం, చిత్రకళా వస్తువులు, శాలువలు, తలపాగాలు, దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాలు ఉన్నాయి. వీటిని ఇప్పటికే న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శనకు ఉంచారు. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖలతో పాటు పొరుగుదేశాలకు చెందిన ప్రతినిధులు ప్రధానికి ఇచ్చిన గిఫ్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ ఏడాది జనవరి మాసంలోనూ ఇలాగే ప్రధాని మోదీ అందుకున్న దాదాపు 1800 గిఫ్ట్‌లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా పక్షం రోజుల పాటు అమ్మకానికి పెట్టారు. ఈ గిఫ్ట్‌ల వేలం ద్వారా వచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గంగా నదీ శుద్ధీకరణ ప్రాజెక్టు(నమామి గంగే) కోసం వెచ్చించనుంది.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...