Home /News /national /

OVER 2 CR CASH AND NEARLY 3 KG GOLD COINS FOUND DURING ED RAID LINKED TO DELHI MINISTER SATYENDRA JAIN PVN

Delhi మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు..భారీగా కరెన్సీ నోట్ల కట్టలు,బంగారం!

మంత్రి ఇంట్లో ఐటీ  సీజ్ చేసిన బంగారం,డబ్బు

మంత్రి ఇంట్లో ఐటీ సీజ్ చేసిన బంగారం,డబ్బు

Cash,Gold Coins In Satyendra Jain Home:మ‌నీ ల్యాండ‌రింగ్(Money Laundering)కేసులో ఇప్ప‌టికే అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నేత‌, ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్(Sayendra Jain),ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)వెల్లడించింది.

ఇంకా చదవండి ...
Cash,Gold Coins In Satyendra Jain Home:మ‌నీ ల్యాండ‌రింగ్(Money Laundering)కేసులో ఇప్ప‌టికే అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నేత‌, ఢిల్లీ మంత్రి స‌త్యేంద్ర జైన్(Sayendra Jain),ఆయన సన్నిహితుల నివాసాల్లో జరిగిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)వెల్లడించింది. మంత్రి ఇంటిలో 2.82 కోట్ల రూపాయల నగదు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు ల‌భ్య‌మయ్యాయి. ఈ బంగారం, న‌గ‌దుకు సంబంధించి స‌త్యేంద్ర జైన్ స‌రైన వివ‌రాలు చెప్ప‌లేక‌పోవ‌డంతో వాటిని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇతర పత్రాలను, డిజిటల్​ రికార్డులను సీజ్​ చేసినట్లు ఈడీ చెప్పింది. విచారణ కొనసాగుతోందని ఈడీ వివరించింది.

కోల్​కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో స‌త్యేంద్ర జైన్ ని మే 30న ఈడీ అదుపులోకి తీసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(CM Kejriwal)హయాంలో మంత్రిగా ఉన్న జైన్‌ 2015-16 సంవత్సరంలో కోల్‌కతాకు చెందిన ఒక సంస్థతో అక్రమ నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ తెలిపింది. పలు షెల్‌ కంపెనీల నుండి సత్యేందర్‌ జైన్‌కు రూ.4.81 కోట్లు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సత్యేందర్‌జైన్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అయితే ఆ కేసు విచార‌ణ‌లో భాగంగా సత్యేందర్‌ జైన్‌కు ఈ నెల 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కస్టడీ విధిస్తూ రౌన్‌ ఎవెన్యూ న్యాయస్థానం ఇటీవల తీర్పునిచ్చింది.

కరోనాతో అనాథలైన చిన్నారులు..లోన్ కట్టాలంటూ LIC నోటీసులు..చివరికి

Kerala Gold Smuggling Case : గోల్డ్ స్మగ్లింగ్ లో సీఎం విజయన్ హస్తం..రాజీనామాకు డిమాండ్..సీఎంకి భారీ భద్రత!

సత్యేందర్ జైన్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో ఆరోగ్యం (Delhi Health Minister),హోం, విద్యుత్, PWD, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి & వరదలు, నీటిపారుదల, నీటి శాఖ తదితర శాఖలకు మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన షకుర్‌బస్తీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన అరెస్టుతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకులు, కావాలనే ఇలా చేస్తుందని ఆప్ నాయకులు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వంపై కేంద్ర సర్కారు కక్ష కట్టిందని ఆప్ నేతలు, కేజ్రీవాల్ సైతం చెబుతూ వస్తున్నారు. సత్యేంద్ర జైన్​ ఇంట్లో జరిగిన ఈడీ దాడులను ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఖండించారు. ఆయనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పారు.ప్రధాని మోదీతో దర్యాప్తు సంస్థలు ఉండొచ్చని, కానీ తమతో దైవం ఉందని కేజ్రీవాల్​ పేర్కొన్నారు. అయితే ఈడీ రెయిడ్స్ లో మంత్రి ఇంట్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడటం సంచలనంగా మారింది. ఈడీ సోదాలపై అరవింద్​ కేజ్రీవాల్​ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కౌంటర్​ ఇచ్చాయి. రానున్న రోజుల్లో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని ఆరోపించాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ను కూడా విచారించాలని బీజేపీ(BJP)డిమాండ్​ చేసింది. ఈ కేసుతో ఆయనకు కూడా సంబంధం ఉందని,అందుకే జైన్​కు క్లీన్​చిట్​ ఇచ్చారని ఆరోపించింది. ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వస్తాయని,తర్వాత విచారణ ఎదుర్కొనేది మనీశ్​ సిసోడియా అని కాంగ్రెస్ విమర్శించింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Aravind Kejriwal, Delhi, Enforcement Directorate, Money

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు