• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • OVER 130 JAISH MEN KILLED IN BALAKOT AIR STRIKE 45 STILL BEING TREATED BY PAK ARMY DOCTORS REPORT SK

బాలాకోట్‌లో 170 మంది ఉగ్రవాదులు హతం..ఇటాలియన్ జర్నలిస్ట్ సంచలన కథనం

బాలాకోట్‌లో 170 మంది ఉగ్రవాదులు హతం..ఇటాలియన్ జర్నలిస్ట్ సంచలన కథనం

బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరం

దాడులు జరిగిన ప్రాంతం ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఉందని ఫ్రాన్సిస్కో మెరినో తన కథనంలో ప్రస్తావించారు. స్థానిక పోలీసులతో పాటు ఎవ్వరినీ కొండపైకి అనుమతించడం లేదని స్పష్టంచేశారు.

 • Share this:
  బాలాకోట్‌లో వైమానిక దాడులపై ఇప్పటికీ రచ్చ జరుగుతోంది. పాకిస్తాన్‌ భూభాగంలో భారత వాయుసేన జరిపిన దాడుల్లో ఎంత మంది చనిపోయారన్న దానిపై ఓ క్లారిటీ లేదు. 300 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని భారత్ స్పష్టం చేస్తుంటే...పాకిస్తాన్ మాత్రం అక్కడ రెండు మూడు చెట్లు మాత్రమే కూలిపోయాయని వాదిస్తోంది. మనదేశంలోని విపక్ష పార్టీలు సైతం ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో బాలాకోట్ స్ట్రైక్‌కు సంబంధించి ఓ అంతర్జాతీయ విలేఖరి సంచలన కథనాన్ని ప్రచురించారు. IAF ఎయిర్‌ స్ట్రైక్స్‌లో 130-170 మంది ఉగ్రవాదులు చనిపోయారని పేర్కొన్నారు.

  ఇటాలియన్ జర్నిలిస్ట్ ఫ్రాన్సిస్కా మెరినో 'స్ట్రింజర్ ఏసియా' పత్రికలో సంచలన కథనాన్ని రాశారు. భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిందని తన కథనంలో పేర్కొన్నారు.
  ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో 13-170 మంది (ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారితో కలిపి) ఉగ్రవాదులు చనిపోయారు. మృతుల్లో 11 మంది ట్రైనర్స్, బాంబులు తయారు చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఘటన తర్వాత జైషే మహమ్మద్ ప్రతినిధులు మృతుల కుటుంబాలను కలిసి భారీగా డబ్బు ఇచ్చారు. విషయం బయటపకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.
  మెరినో
  అంతేకాదు వైమానిక దాడులు జరిగిన వెంటనే శింకియారి క్యాంప్ (బాలాకోట్‌కు 20 కి.మీ. దూరం) నుంచి పాకిస్తాన్ ఆర్మీ బలగాలు చేరుకున్నాయని ఆమె తన కథనంలో పేర్కొన్నారు. ''వైమానిక దాడుల్లో గాయపడ్డవారిని హర్కత్ ఉల్ ముజాహిదీన్ క్యాంపునకు తీసుకెళ్లారు. వారికి పాకిస్తాన్ ఆర్మీ డాక్టర్లు వైద్య చికిత్స అందించారు. ఆ క్యాంపులో ఇప్పటికీ 45 మందికి చికిత్స అందిస్తున్నారని స్థానికులు చెప్పారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ 20 మంది చనిపోయారు. చికిత్స అనంతరం కోలుకున్న ఉగ్రవాదులు ఇప్పటికీ పాక్ ఆర్మీ కస్టడీలోనే ఉన్నారు'' అని ఫ్రాన్సిస్కా మెరినో తెలిపారు.

  బాలాకోట్‌లో దాడి జరిగిన ఆనవాళ్లను పాకిస్తాన్ ఆర్మీ మాయం చేసిందని మేరినో వెల్లడించారు. కొండ దిగువన నుంచి జైషే మహమ్మద్ క్యాంపునకు వెళ్లేదారిలో కొత్తగా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. కొండపై తలీమ్-ఉల్-ఖురాన్ నడుస్తోందని సైన్ బోర్డుల్లో పేర్కొన్నారని.. కానీ వైమానిక దాడులకు ముందు అలాంటివి ఏవీ అక్కడ లేవని వెల్లడించారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ పేరిట భవనాల పేర్లు కనిపించేవని..ఇప్పుడు వాటన్నింటినీ తొలగించారని పేర్కొన్నారు. దాడులు జరిగిన ప్రాంతం ఇప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉందని ఫ్రాన్సిస్కో మెరినో తన కథనంలో ప్రస్తావించారు. స్థానిక పోలీసులతో పాటు ఎవ్వరినీ కొండపైకి అనుమతించడం లేదని స్పష్టంచేశారు.

  అసలు బాలాకోట్‌లో ఎలాంటి నష్టం జరగలేదని ముందు నుంచీ బుకాయిస్తోంది పాకిస్తాన్. దాడి జరిగిన ప్రాంతానికి భారత జర్నలిస్టులను కూడా అనుమతిస్తామని ఇటీవల వెల్లడించింది. ఆ ప్రకటన చేసిన వారం రోజులకే ఇటాలియన్ జర్నలిస్ట్ కథనం రాయడం విశేషం. మరి దీనిపై పాకిస్తాన్ ఆర్మీ ఎలా స్పందించబోతుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది.


  కాగా, ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులుచేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ మరుసటి రోజే భారత మిలటరీ స్థావరాలను పాకిస్తాన్ వాయుసేన టార్గెట్ చేయడంతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అప్రమత్తమై తిప్పికొట్టింది. భారత్ వైపు దూసుకొచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో F-16ని అభినందన్ తరిమికొట్టాడు. మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌తో వెంబడించి ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు. ఆ క్రమంలో పాక్ విమానంతో పాటు అభినందన్ విమానం కూడా కుప్పకూలింది.

  పారాచూట్ సాయంతో ప్రాణాలు కాపాడుకున్న అభినందన్..పీవోకేలోని ఓ గ్రామంలో దిగడంతో స్థానికులు చితకబాది పాక్ మిలటరీకి అప్పగించారు. భారత వాయుసేన రహస్యాలను కూపీలాగేందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నించినప్పటికీ..అభినందన్ ఏ వివరాలను బహిర్గతం చేయలేదు. ఐతే భారత్‌తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఎట్టకేలకు తలొగ్గిన పాకిస్తాన్...అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. కాగా, F-16 జెట్‌ని కూల్చిన తొలి ఫైటర్ పైలట్ అభినందనే కావడం విశేషం.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు