మన హెలికాప్టర్‌ను మనమే కూల్చాం.. తప్పు జరిగిందన్న ఎయిర్‌ఫోర్స్ చీఫ్

ఆ ఘటనపై తాజాగా ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదూరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మన హెలికాప్టర్‌ను మన క్షిపణే కూల్చిందని.. తప్పు జరిగిందని వెల్లడించారు.

news18-telugu
Updated: October 4, 2019, 4:32 PM IST
మన హెలికాప్టర్‌ను మనమే కూల్చాం.. తప్పు జరిగిందన్న ఎయిర్‌ఫోర్స్ చీఫ్
హెలికాప్టర్ శకలాలు
  • Share this:
ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఐతే మరునాడు కశ్మీర్‌లోని బుడ్గాంలో భారత వాయుసేనకు చెందిన Mi-17 హెలికాప్టర్‌ కూలిపోయింది. అప్పటికే ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో మన చాపర్‌ని పాక్ విమానాలు కూల్చాయని అంతా అనుకున్నారు. ఐతే అలాంటిదేమీ లేదని వాతావరణం అనుకూలించకపోవడం వల్లే కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై తాజాగా ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదూరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మన హెలికాప్టర్‌ను మన క్షిపణే కూల్చిందని.. తప్పు జరిగిందని వెల్లడించారు.

Mi-17 హెలికాప్టర్ ప్రమాదంపై కోర్టు విచారణ ముగిసింది. మన క్షిపణి వల్లే అది కూలిపోయింది. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటాం. మా వల్లే ఈ పెద్ద తప్పు జరిగిందని అంగీకరిస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
రాకేష్ కుమార్ సింగ్ బదూరియా


అసలేం జరిగిదంటే..?
బాలాకోట్ దాడుల తర్వాతి రోజు (ఫిబ్రవరి 27) ఉదయం 09.30 గంటల ప్రాంతంలో భారత గగత తలంలోకి ప్రవేశించిందుకు పాకిస్తాన్ యుద్ధ విమానాలు ప్రయత్నించాయి. వాటిని తిప్పికొట్టేందుకు భారత్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు వెళ్లాయి. ఉదయం 10.10 సమయంలో Mi-17 హెలికాప్టర్ కూడా శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి వెళ్లింది. అనంతరం బుడ్గాం సమీపంలో కుప్పకూలింది. ప్రమాదంలో ఆరుగురు  సిబ్బందితో పాటు ఓ పౌరుడు మరణించారు. చనిపోయిన వారిలో స్కాడ్రన్ లీడర్స్ సిద్దార్థ్ వశిష్ట్, నినద్ మండ్నానె, కుమార్ పాండే, సర్జియంట్ విక్రాంత్ షెరావత్, కార్పరల్స్ దీపక్ పాండే, పంకజ్ కుమార్‌ ఉన్నారు.
First published: October 4, 2019, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading