Home /News /national /

OUR COLLECTIVE HEALTH DEPENDS ON THE SUCCESS OF OUR VACCINATION DRIVE SA

అంతర్జాతీయ అంతరాలకు అతీతంగా వ్యాక్సినేషన్!


Our collective health depends on the success of our vaccination drive

Our collective health depends on the success of our vaccination drive

దేశాలకు మెటీరియల్ అందించడమే కాకుండా, వ్యాక్సిన్ నిరాసక్తతను తగ్గించడం, పెద్దమొత్తంలో వ్యాక్సినేషన్ అందించడం గురించి ఉపయోగపడే కేస్ స్టడీలను కూడా భారతదేశం అందిస్తోంది

  భారతదేశం ఇటీవల 85 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటింది. దేశంలో వ్యాక్సినేషన్ ఇదే పద్ధతిలో కొనసాగితే, వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో ఉన్న వయోజనుల జనాభా అందరికీ కొవిడ్-19ను తట్టుకునే శక్తి వస్తుంది. ఈ విజయాల ఘనత పూర్తిగా మన దేశీయంగా వ్యాక్సిన్లు తయారుచేసిన SII, భారత్ బయోటెక్ సంస్థలకు దక్కుతుంది. వీటితో పాటుగా Network18 సంజీవని – ఎ షాట్ ఆఫ్ లైఫ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ వారి, CSR ఇనిషియేటివ్ లాంటి పెద్దమొత్తంలో చేసిన వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమాలకు చెందుతుంది. కానీ మనలాంటి అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ‘వసుదేవ కుటుంబకం అనే సంస్కృతిని, విలువలను పాటించే మన భారతదేశంలో వ్యాక్సిన్ పంపిణీ సంబంధిత సమస్యలను ప్రపంచవ్యాప్తంగా అన్వయించాల్సి ఉంది. అంతర్జాతీయంగా పేద, ధనిక వర్గాల వారికి వ్యాక్సిన్ అందడంలో అంతరాయాల వల్ల, వైరస్ కొత్త వేరియంట్లకు మార్గం సుగమం అయ్యేలా ఉంది.

  ఈ అంతరాయాలను సమతుల్యం చేయడానికి ప్రాథమిక చర్యల్లో ఒకటైన, WHO వారి ఇండిపెండెంట్ అలోకేషన్ వ్యాక్సిన్ గ్రూప్ (IAVG) సిఫారసు చేసినది ఏంటంటే, వ్యాక్సిన్ ఉత్పాదక, ఎక్కువ కవరేజీ ఉన్న దేశాలు వ్యాక్సిన్ సమంగా, పారదర్శకంగా అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. COVAXIN వ్యాక్సిన్ సరఫరాను పెంచడం, వ్యాక్సిన్లను ఒకదగ్గరే పెట్టి ఎక్కువగా వేస్ట్ అవకుండా చూడటం ద్వారా వారు ఇలా చేయవచ్చు. ఈ ప్రాథమిక చర్యల్లో భారతదేశానికి కూడా భాగం ఉంది, జపాన్, ఆస్ట్రేలియా, US లాంటి దేశాలు ఉన్న క్వాడ్ గ్రూప్ దేశాల్లో భాగంగా 120 కోట్ల వ్యాక్సిన్లను దానం చేయడానికి భారతదేశం ముందుకువచ్చింది. కుంచితమైన ప్రాంతీయ లేదా జాతీయ సమస్యల కంటే అందరికీ మంచి జరిగే విషయం గురించి భారతదేశం చూపించే శ్రద్ధకు ఇది నిదర్శనం.

  దేశాలకు మెటీరియల్ అందించడమే కాకుండా, వ్యాక్సిన్ నిరాసక్తతను తగ్గించడం, పెద్దమొత్తంలో వ్యాక్సినేషన్ అందించడం గురించి ఉపయోగపడే కేస్ స్టడీలను కూడా భారతదేశం అందిస్తోంది. తప్పుడు సమాచారం అనే అడ్డుగోడలను తొలగించడంలో ప్రైవేట్ సంస్థలు, NGOలు, సామాజిక సంస్థలు ఉపయోగపడతాయని వ్యాక్సిన్ అవగాహన పెంచడంలో, భారతీయులు అందరికీ వ్యాక్సిన్ అందించడంలో Network18 సంజీవని – ఎ షాట్ ఆఫ్ లైఫ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ వారి CSR కార్యక్రమం యొక్క అనుభవాలు నిరూపించాయి. కలిసికట్టా పనిచేయడం వెనక ఉన్న ప్రాముఖ్యతను కూడా ఈ కార్యక్రమం చూపించింది. కుటుంబాలను, కమ్యూనిటీలను రక్షించడంలో జాతీయస్థాయి కార్యాచరణలో భాగంలో ఈ కార్యక్రమం వ్యాక్సిన్లను అందజేసింది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా, కొద్దిగా ధైర్యం, పట్టుదల ఉంటే సాధించడానికి ఏ లక్ష్యం కూడా పెద్దది కాదని నిరూపించింది.

  ప్రస్తుతం ప్రపంచానికి ఎక్కువగా అవసరమైన లక్షణాలు ఇవే. 2021 రెండో అర్ధభాగంలో వ్యాక్సిన్ సరఫరా 25% తగ్గిందని IAVG చెబుతుండగా, తక్కువ వ్యాక్సిన్ కవరేజీ ఉన్న దేశాలకు సహాయం చేయడానికి ప్రపంచ దేశాలు తమ వనరులను అందించాల్సిన తరుణం ఇది. వ్యక్తిగత పౌరులుగా, మనం అందరం వ్యాక్సిన్ సమానత్వానికి, అంతర్జాతీయ సంఘీభావానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం, వ్యాధినిరోధకత లాంటి ప్రాథమిక హక్కులను సంతృప్తిపరుచుకోలేని వాళ్లకు మనం తప్పనిసరిగా సహాయం చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మహమ్మారికి రంగు, జాతి, మతం అనే భేదాలు ఉండవు.

  కొవిడ్-19 వ్యాక్సిన్ గురించి తాజా వార్తలు, సమాచారం కోసం, Network18 సంజీవని – ఎ షాట్ ఆఫ్ లైఫ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ వారిని ఫాలో అయ్యి, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో సహాయం చేయండి.
  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Sanjeevani, Vaccinated for Covid 19

  తదుపరి వార్తలు