News18 Special: ఇక్కడ నోటీసులు అంటించరాదు.. 100 ఏళ్లుగా పాటిస్తున్న ప్రత్యేక గ్రామం

ఇక్కడ నోటీసులు అంటించరాదు.. 100 ఏళ్లుగా పాటిస్తున్న ప్రత్యేక గ్రామం

News18 Special: సిటీలు ఎలాగూ కాలుష్యంతో ఉంటాయి... పల్లెల్లో అందం వేరు. కానీ ఈ రోజుల్లో పల్లెల్లో కూడా కాలుష్యం వచ్చేస్తోంది. ఆ గ్రామం మాత్రం కొన్ని కండీషన్లను కచ్చితంగా అమలుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

 • Share this:
  Othaveedu: తమిళనాడు... మదురైలోని... కరుపయురాణీ ప్రాంతంలో... ఒత్తవీడు అనే గ్రామం ఉంది. చాలా చిన్న ఊరు. అక్కడికి వెళ్లిన వారికి "గ్రామంలోకి స్వాగతం... ఈ ఊళ్లో నోటీసులు, పోస్టర్లు అంటించవద్దు" అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఊళ్లో 100 ఏళ్లుగా ఈ రూల్ అందరూ పాటిస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఎక్కడ చూసినా చిన్న పాంప్లెట్ కూడా కనిపించదు. వందేళ్ల కిందట... తిరుమంగళం నుంచి వచ్చిన మూడు కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. అందరూ ఒకే ఇంట్లో నివసించారు. అలా ఈ ఊరికి ఒత్తవీడు (ఒక ఇల్లు) అనే పేరు వచ్చింది. ఆ సింగిల్ ఇల్లు కాస్తా ఇప్పుడు 300 ఇళ్లు అయ్యాయి. ఇక్కడ 650 మంది ఓటర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నా... గ్రామంలో ఉన్న ఆచారాలు, రూల్స్ మాత్రం అందరూ కచ్చితంగా పాటిస్తున్నారు.

  ఈ ఊళ్లో ఏ రాజకీయ పోస్టర్లు, బ్యానర్లు, విగ్రహాలు, యాడ్లూ, ఏవీ ఉండకూడదని గ్రామస్థులు ఫిక్స్ అయ్యారు. అలాంటి వాటితో ఎవరూ ఊళ్లోకి రావడానికి కూడా వీలు లేదు. చివరకు పెళ్లి పోస్టర్లు, పెళ్లి బ్యానర్లు కూడా ఉండవు. సినిమా వాల్ పోస్టర్లు కూడా ఇక్కడ ఉండవు. మొత్తం పర్యావరణహితమే.

  ఇక్కడ నోటీసులు అంటించరాదు.. 100 ఏళ్లుగా పాటిస్తున్న ప్రత్యేక గ్రామం


  "రాజకీయాలు వివాదాల్ని సృష్టిస్తాయి. మేము మాలో ఐక్యతను కాపాడుకోవాలి. మా గ్రామాన్ని అందంగా ఉంచుకోవాలి. అందుకే మేం ఈ నిబంధనలు పాటిస్తున్నాం" అని 69 ఏళ్ల ఎలంగోవన్ తెలిపారు. "రాజకీయ నేతలు మా దగ్గరకు వస్తున్నారు. ఓట్లు అడుగుతున్నారు. మాకు సరైన గౌరవం ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకు ఏం కావాలో వాళ్లకు చెబుతున్నాం. మేము ఈ దేశ పౌరులుగా మా విధులు నిర్వహిస్తున్నాం. కానీ అధికారులు, నేతలు మాత్రం ఈ ఊరికి ఏమీ చెయ్యకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఫెయిలవుతున్నారు" అని ఆయన తెలిపారు.

  "మేము చనిపోయిన వారిని పూడ్చిపెడతాం. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరుపుతాం. ఐతే... బ్యానర్లు, మ్యూజిక్ వంటివి ఏవీ ఉండవు. ఇక్కడ కులం పరంగా మేము ఎవరినీ విబేధించం." అని ముత్తు తెలిపారు.

  "మా గ్రామం అందమైనది. అందరికీ తెలిసినది. కానీ మేము రేషన్ సరుకుల కోసం కరుపయురాణికి వెళ్లాల్సి వస్తోంది. మా గ్రామంలోనే రేషన్ షాపు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. మాకు సరైన తాగు నీరు కూడా కల్పించాలి" అని పళనియమ్మ కోరారు.

  "స్నేహితులు, బయటివారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఒకింత ఆశ్చర్యపోతూ ఉంటారు. మా ఊళ్లో సరికొత్త మోడ్రన్ డెవలప్‌మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మేము మా పాత విలువల్ని వదల్లేదు" అని కృతికా గర్వంగా తెలిపారు.

  ఇది కూడా చదవండి: Vastu Shastra: ఇంట్లో టీవీ, అల్మరాను ఆ దిశలో అస్సలు ఉంచొద్దు... ఉంచితే కష్టాలే...

  దేశమంతా ఇలాంటి పోస్టర్లు, బ్యానర్ల వల్ల కాలుష్యం అవుతోంది. వాటిని తిని ఆవుల వంటి మూగజీవులు అనారోగ్యాలపాలవుతున్నాయి. ఈ గ్రామంలో వారు మాత్రం ఇలా ఐక్యంగా ఉంటూ... కాలుష్యానికి దూరంగా ఉండటం మంచి విషయమే కదా.
  Published by:Krishna Kumar N
  First published: