హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కుల పెద్ద పెదరాయుడు తీర్పు : తనను పెళ్లికి పిలవని కుటుంబాన్ని 10 ఏళ్లు గ్రామ బహిష్కరణ!

కుల పెద్ద పెదరాయుడు తీర్పు : తనను పెళ్లికి పిలవని కుటుంబాన్ని 10 ఏళ్లు గ్రామ బహిష్కరణ!

బాధిత కుటుంబం(Image Source : Google)

బాధిత కుటుంబం(Image Source : Google)

Family Ostracised : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా కొన్ని వర్గాలు మాత్రం ఇంకా అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. దేశంలొని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సామాజిక జాఢ్యాలు అణగారిన వర్గాల వారిని పట్టి పీడుస్తూనే ఉన్నాయి. దీని కారణంగా చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Family Ostracised : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా కూడా కొన్ని వర్గాలు మాత్రం ఇంకా అణిచివేతకు గురవుతూనే ఉన్నారు. దేశంలొని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సామాజిక జాఢ్యాలు అణగారిన వర్గాల వారిని పట్టి పీడుస్తూనే ఉన్నాయి. దీని కారణంగా చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. తాజాగా కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా(Uttara Kannada)లో జరిగిన ఇలాంటి ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాలోని హర్వాడ గ్రామంలో హాలక్కి వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఆనంద సిద్ద గౌడ, బంట వెంకు గౌడ కుటుంబాలు గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉండేవి. రోజులు గడుస్తున్న కొద్దీ చిన్న చిన్న గొడవలు.. ఆస్తి సమస్య వరకు చేరి పెద్ద ఎత్తున గొడవకు దారితీశాయి. ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఆనందగౌడ కుటుంబం విడిపోయింది. కుల పెద్దకు తాంబూలం ఇవ్వలేదనే కారణంతో తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అప్పటి నుంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? వెంకు గౌడ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచించాడు. ఈ క్రమంలో 2012 ఫిబ్రవరిలో బంట వెంకు గౌడ తన కుమారుడు విజయ్ గౌడకి పెళ్లి చేశాడు. అయితే ఆ సమయంలో గ్రామ పెద్ద ఆనంద్ సిద్దెగౌడ కుటుంబాన్ని పెళ్లికి ఆహ్వానించలేదు వెంకు గౌడ. దీంతో అసహనానికి గురైన ఆనంద్ సిద్దెగౌడ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. తమ కుటుంబాన్ని పెళ్లికి పిలవలేదు అన్న సాకుతో కులస్థులను పిలిచి వెంకు గౌడ కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేయించాడు. వెంకు గౌడ కుటుంబానికి గ్రామస్తులెవరూ ఎలాంటి సహయం చేయకూడదని.. నీళ్లు, నిత్యావసరాలు లాంటివి కూడా అందించరాదని ఆంక్షలు విధించారు.


నుపూర్ శర్మను చంపేందుకు ఐసిస్ ఫ్లాన్..భారత్ మాస్టర్ స్కెచ్ తో రష్యాలో ఉగ్రవాది అరెస్ట్!దీంతో నాటి నుంచి గ్రామానికి చెందినవారెవ్వరూ కూడా వెంకు గౌడ కుటుంబంతో మాట్లాడటం లేదు. వెంకు గౌడ ఇంటి మంచీ చెడ్డలకు ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. అయితే తమకు జరిగిన అన్యాయం గురించి వెంకు గౌడ కుమారుడు విజయ్ గౌడ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఇక,సామాజిక బహిష్కరణతో మనస్తాపానికి గురైన వెంకు గౌడ 2014లో మరణించాడు. వెంకు గౌడ 2014లో మరణించినా వారి కుటుంబంపై బహిష్కరణ కొనసాగింది. తాజాగా వెంకు గౌడ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి మీడియాలో కథనాలు రావడంతో అధికారుల్లో స్పందన వచ్చింది. ఉత్తర కన్నడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంకోలా తహశీల్దార్... సిద్దెగౌడ, ఇతర గ్రామస్తులను, వెంకు బంట్ గౌడ కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. తహశీల్దార్ మధ్యవర్తిత్వం వహించి గ్రామస్తులు వెంకు గౌడ కుటుంబాన్ని తిరిగి తమ సంఘంలోకి ఆహ్వానించేలా చేయడంతో వారి కుటుంబంపై సామాజిక బహిష్కరణ ముగిసింది. తహశీల్దార్ మాట్లాడుతూ ...భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని, గ్రామాన్ని తరచూ సందర్శించాలని స్థానిక అధికారులు, అసిస్టెంట్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Karnataka

ఉత్తమ కథలు