పెళ్లి (Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. ఈ ఆనందకరమైన క్షణాలలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా వధూవరులు, వారి బంధువులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరీ పూర్తి చేస్తారు. అయితే ఈ రోజుల్లో ఇవి కాకుండా అదనంగా వివాహ వేడుకలలో వింత స్టంట్స్ చేస్తూ వధూవరులు ఆశ్చర్యపరుస్తున్నారు. ఏదో ఒకటి కొత్తగా చేస్తేనే తమ పెళ్లి రోజు ఎప్పటికీ గుర్తుండి పోతుందని భావిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక వరుడు తన పెళ్లిలో చేసిన ఓ పని ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ వరుడు అమెజాన్(Amazon)లో పనిచేస్తున్న నవ వధువుకు సర్‌ప్రైజ్ చేసేందుకు వరమాలను దాచి పెట్టారు. అనంతరం అమెజాన్ నుంచి వరమాలను ఆర్డర్ చేశారు. తన పెళ్లిని అమెజాన్ బ్రాండ్ ప్రమోషన్‌కు వేదికగా మార్చి, భార్యను సర్‌ప్రైజ్ చేసినట్లు తెలిపారు.
పెళ్లి జరుగుతున్న వేళ డెలివరీ(Delivery) బాయ్ సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం చూసి బంధువులంతా నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదేం వెడ్డింగ్-స్కిట్ బాబోయ్ అని నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణ వర్ష్నే అనే ఒక యువకుడు Regalixలో గూగుల్ యాడ్స్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అతనికి అమెజాన్‌లో గ్రూప్ ఆపరేషన్ మేనేజర్ అయిన ఫాగుని ఖన్నా (Faguni Khanna)తో పెళ్లి కుదిరింది. అయితే ఈ పెళ్లి వేడుకలలో తన భార్య పని చేస్తున్న అమెజాన్ కంపెనీ నుంచే వరమాల తెప్పించి ఖుషి చేయాలనుకున్నాడు. అందుకోసం ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్న వరమాలను దాచిపెట్టాడు. పెళ్లి మాల మిస్సయిందని నాటకం ఆడుతూ అతను గందరగోళం సృష్టించాడు. ఆపై అమెజాన్‌లో వరమాల ఆర్డర్ చేశానని, వెయిట్ చేయండి అంటూ చెప్పాడు.
కొంత సమయం తర్వాత డెలివరీ బాయ్ ఒక పెట్టెలో వరమాల తీసుకొని పెళ్లి మండపానికి వచ్చాడు. ఆ సీన్ చూసి పెళ్లి చేసుకునే వేళ ఈ డెలివరీలు ఏంటో అని నోరెళ్లబెట్టడం బంధువుల వంతయింది. అలానే ఈ వివాహానికి విచ్చేసిన అతిథులు మరెక్కడా చూడని వింత పెళ్లిని ఇక్కడే చూసినట్లయింది. "వరమాల పోయినట్లు నా అమెజానియన్ భార్య ఫాగుని ఖన్నాను నమ్మించి, దాన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను" అని వరుడు లింక్డ్‌ఇన్ వేదికగా పేర్కొన్నారు. అలానే పెళ్లి మండపంపై అమెజాన్ బాక్స్‌లో వరమాలను అందిస్తున్న డెలివరీ బాయ్ పిక్‌తో పాటు తన భార్య, తన ఫొటోను షేర్ చేశాడు. "నా లవ్లీ వైఫ్ కోసం ప్రేమతో బ్రాండ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను" అని తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
ఈ లింక్డ్‌ఇన్ పోస్ట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ఐడియా చాలా క్రియేటివ్ గా ఉందని పొగిడారు. మరికొందరు మాత్రం ఒక పెళ్లి వేడుకను సర్కస్ స్టంట్ లాగా మార్చడం ఏం బాలేదు అని పెదవి విరిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Home delivery, Linkedin, Marriage