హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Monkeypox: ఓరి ! నాయనో ఇదెక్కడి రోగం.. లైంగిక సంపర్కం ద్వారా కూడా మంకీ పాక్స్ .. WHO సంచలన విషయాలు..!

Monkeypox: ఓరి ! నాయనో ఇదెక్కడి రోగం.. లైంగిక సంపర్కం ద్వారా కూడా మంకీ పాక్స్ .. WHO సంచలన విషయాలు..!

 ఓరి ! నాయనో ఇదెక్కడి రోగం.. సెక్స్ ద్వారా కూడా మంకీ పాక్స్ .. who సంచలన విషయాలు..

ఓరి ! నాయనో ఇదెక్కడి రోగం.. సెక్స్ ద్వారా కూడా మంకీ పాక్స్ .. who సంచలన విషయాలు..

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(WHO) ఇటీవలే మంకీపాక్స్‌(Monkeypox) వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల తరువాత, సోమవారం డబ్ల్యూహెచ్‌వో ఉన్నత అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా, ఆగ్నేయాసియా ప్రాంతంలో వైరస్ ప్రమాదాన్న?

ఇంకా చదవండి ...

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(WHO) ఇటీవలే మంకీపాక్స్‌(Monkeypox) వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల తరువాత, సోమవారం డబ్ల్యూహెచ్‌వో ఉన్నత అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా, ఆగ్నేయాసియా ప్రాంతంలో వైరస్ ప్రమాదాన్ని మోడరేట్‌గా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో సౌత్-ఈస్ట్ ఆసియా(Asia) రీజియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ కె సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘చాలా దేశాలలో మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ఆగ్నేయాసియా ప్రాంతంలో మంకీపాక్స్ ప్రమాదం మోడరేట్‌గా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. డబ్ల్యూహెచ్‌వో తన ల్యాబొరేటరీ, ఇతర నిపుణుల బృందాలతో అందుబాటులో ఉన్న డేటాను క్రమం తప్పకుండా సమీక్షిస్తోంది.’ అని చెప్పారు.

వైరస్ వ్యాప్తి ప్రైమరీ సోర్స్‌ గురించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇది ప్రధానంగా సన్నిహిత శారీరక, లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారి చర్మానికి తాకిన వివిధ కంటామినేటెడ్‌ మెటీరియల్స్‌ ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్ వ్యాప్తి ప్రధానంగా లైంగిక సంబంధంతో సహా సన్నిహిత శారీరక సంబంధం ద్వారా జరుగుతుంది. వైరస్‌ సోకిన వారి స్కిన్‌ పార్టికల్స్‌ ఉన్న పరుపులు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు వంటి వస్తువుల నుంచి కూడా వైరస్‌ సోకుతుంది. మంకీపాక్స్‌ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన చర్యలు రూపొందించడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు, మన ప్రయత్నాలు, చర్యలు సున్నితంగా ఉండాలి. ఈ విషయంలో భయాందోళనలు, వివక్ష లేకుండా చూడాలి.’ అని చెప్పారు.

95 శాతం కేసులు లైంగిక చర్యలతో

గురువారం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 95 శాతం మంకీపాక్స్ వైరస్ కేసుల వ్యాప్తి లైంగిక కార్యకలాపాల ద్వారానే జరుగుతున్నాయి. ఈ రోజు వరకు వైరస్‌ వ్యాప్తిపై జరిగిన అతిపెద్ద అధ్యయనం.. ఇప్పటివరకు చాలా వరకు కేసులు ప్రధానంగా పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో మాత్రమే బయట పడ్డాయని స్పష్టం చేసింది.

జాగ్రత్తగా ఉండాలని వైద్యుల హెచ్చరిక

ఈ వైరస్ లైంగిక కార్యకలాపాలకే పరిమితం కాదని, సన్నిహిత శారీరక సంబంధం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు, వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సంప్రదాయ కోణంలో మంకీపాక్స్ లైంగికంగా సంక్రమించే వ్యాధి మాత్రమే కాదని నొక్కి చెప్పడం అవసరమని, ఏ విధమైన సన్నిహిత శారీరక సంబంధం ద్వారానైనా ఇది సోకవచ్చు అధ్యయన బృంద సభ్యుడు జాన్ థోర్న్‌హిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని నిర్లక్ష్యంగా పరిగణించవద్దని పరిశోధకులు, వైద్యులు కోరుతున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో నాలుగు మంకీ పాక్స్ వైరస్ కేసులను ధ్రువీకరించారు. మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు.

First published:

Tags: Coronavirus, Monkeypox, UNO, WHO

ఉత్తమ కథలు