Home /News /national /

ORI NAYANO EVEN AT HOME THERE IS POLLUTION ARE THERE THINGS BUT THROW IT AWAY IMMEDIATELY OR ITS LIKE GETTING SICK UMG GH

Plastic Pollution: ఓరి నాయనో.. ఇంట్లో కూడా పొల్యూషన్ అంటా ! ఈ వస్తువులు ఉన్నాయా ! అయితే వెంటనే పారేయండి..!

ఓరి నాయనో.. ఇంట్లో కూడా పొల్యూషన్ అంటా ! అ వస్తువులు ఉన్నాయా ! అయితే వెంటనే పారేయండి.. లేదంటే అంతేసంగతులు..

ఓరి నాయనో.. ఇంట్లో కూడా పొల్యూషన్ అంటా ! అ వస్తువులు ఉన్నాయా ! అయితే వెంటనే పారేయండి.. లేదంటే అంతేసంగతులు..

రోజువారీ వినియోగ వస్తువులు కూడా వాయు కాలుష్యాని(Pollution )కి కారణమవుతున్నాయని వెల్లడించింది తాజా రిసెర్చ్. సౌందర్య సాధనాలు, క్రిమిసంహారకాలు, వంట నూనె(Oil) వంటి అనేక కెమికల్ బేస్డ్ వినియోగ వస్తువులు వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌(VOC-వీఓసీ)ను విడుదల చేస్తాయని ఈ అధ్యయనం గుర్

ఇంకా చదవండి ...
వాయు కాలుష్యం(Pollution) అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పెట్రోల్ లేదా డీజిల్ నుంచి వచ్చే వాహన పొగలు, పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే పొగ. అయితే ఇంట్లో ప్లాస్టిక్ కంటైనర్లు, సౌందర్య సాధనాలు, వంట నూనెలు, డియోడ్రెంట్లు(deodorants), ప్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్, దోమల రిపెల్లెంట్స్‌ వంటి రోజువారీ వినియోగ వస్తువులు కూడా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని వెల్లడించింది తాజా రిసెర్చ్. సౌందర్య సాధనాలు, క్రిమిసంహారకాలు, వంట నూనె వంటి అనేక కెమికల్(Chemical) బేస్డ్ వినియోగ వస్తువులు వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌(VOC-వీఓసీ)ను విడుదల చేస్తాయని ఈ అధ్యయనం గుర్తించింది. అహ్మదాబాద్, గాంధీనగర్ ఇళ్లలో నిర్వహించిన పైలట్ స్టడీలో ఈ వివరాలు తెలిశాయి.

భారతదేశంలో రోజు, సీజన్లలో ఇండోర్ కాలుష్య మూలాలను సమగ్రంగా అంచనా వేసిన మొదటి అధ్యయనం ఇది. ఇంట్లో విడుదలయ్యే వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌తో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌కు వేడి చేయడం, కాల్చడం లేదా వంట చేయడం అవసరం లేదు. వీటి కారణంగా కళ్లలో నీరు కారడం, ఎగువ శ్వాసనాళంలో చికాకు, తలనొప్పి లేదా మైకం, వికారం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్'గా పేర్కొంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయని నిపుణులు తెలిపారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Technology)-గాంధీనగర్ (IIT-Gn) శాస్త్రవేత్తల బృందం, అహ్మదాబాద్, గాంధీనగర్‌లోని అమెరికన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా ఓ పైలట్‌ ప్రాజెక్ట్‌ నిర్వహించాయి. ఇండియాలో వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ ఫస్ట్‌ కాంప్రహెన్సివ్‌ అసెస్‌మెంట్‌లో ఇళ్లలోని కాలుష్య కారకాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. ‘వేసవి, శీతాకాలంలో భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో సాధారణ రోజువారీ కార్యకలాపాలలో ఇంట్లో, వెలపల క్వాంటిటీ వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌, వాటి సోర్సెస్‌ లెక్కించడానికి పైలట్ అధ్యయనం' అనే పేపర్ ఇటీవల MDPI జర్నల్‌ ఎన్విరాన్‌మెంట్స్‌లో ప్రచురితమైంది.

జర్నల్‌ రైటర్స్‌లో క్రిస్టినా ఎల్ నోరిస్, రాస్ ఎడ్వర్డ్స్, చిన్మయ్ ఘోరోయ్, జేమ్స్ జె షౌర్, మార్లిన్ బ్లాక్, మైఖేల్ హెచ్ బెర్గిన్ ఉన్నారు. వీరంతా డ్యూక్ యూనివర్సిటీ, మాడిసన్‌లోని విస్కాన్సిన్ యూనివర్సిటీ, IIT గాంధీనగర్, అండర్ రైటర్స్ లాబొరేటరీస్ (UL) Inc సంస్థలకు చెందినవారు. ఈ ప్రాజెక్ట్‌కు అండర్ రైటర్స్ లాబొరేటరీస్ స్పాన్సర్ చేసింది.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

ఈ అధ్యయనం రెండు సీజన్‌లు (వేసవి, శీతాకాలం), 26 ఇళ్లలోని రోజులోని వేర్వేరు సమయాలను (ఉదయం, సాయంత్రం) పరిగణనలోకి తీసుకుంది. వేసవి (150.1 ± 121.0 మైక్రోగ్రాములు ప్రతి క్యూబిక్ మీటర్ గాలి) కంటే శీతాకాలంలో (327.0 ± 224.2 మైక్రోగ్రాములు గాలికి) ఎక్కువ గాఢతతో మొత్తం ఇండోర్ వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్‌లను కొలిచారు. అవుట్‌డోర్‌లో కొలిచిన వాటి కంటే ఎక్కువగా ఉన్నాయి అని పేపర్ పేర్కొంది. ఇన్‌డోర్స్‌లో 69 కంటే తక్కువ కాంపౌండ్స్‌ ప్రబలంగా ఉన్నాయని అధ్యయనం కనుగొంది. అత్యంత సాధారణ వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్‌లలో అసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, పెంటమీథైల్ హెప్టేన్ వేరియంట్స్‌ ఉన్నాయి.

అధ్యయనం వీఓసీ ప్రధాన వనరుగా ప్లాస్టిక్ పదార్థాలను సూచించింది. మే నెలలో, జనవరితో పోలిస్తే ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా 42 శాతం వీవోసీలు ప్లాస్టిక్‌ల నుంచి వచ్చాయి. అది కేవలం 4 శాతం మాత్రమే అందించింది. ఇండోర్‌ కుకింగ్‌, కన్యూమర్‌ ప్రొడక్ట్స్‌ జనవరిలో వరుసగా 29 శాతం, 10 శాతం వీఓసీలను విడుదల చేశాయి. అదే మే నెలలో వరుసగా 16 శాతం, 4 శాతంగా ఉన్నాయి.బహిరంగ కాలుష్యం పరంగా, 84 శాతం వీఓసీలు వాహనానాల నుంచే..
IIT గాంధీనగర్‌లో కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఘోరోయ్ మాట్లాడుతూ..‘వీఓసీలు శ్లేష్మ పొర, తేలికపాటి చికాకు వంటి స్వల్పకాలిక సమస్యల నుంచి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వరకు బాగా తెలిసిన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని చెప్పారు. వాతావరణ మార్పు, నిరంతర ఉష్ణోగ్రత పెరుగుదల సందర్భంలో, పెరిగిన ఆఫ్-గ్యాసింగ్, వీఓసీలను ఉత్పత్తి చేస్తుంది. మరిన్ని ఆరోగ్య ప్రమాదాల ముప్పును పెంచుతుంది. ముఖ్యంగా ఇండోర్ పరిసరాలలో డేటా భారతీయ సందర్భంలో వీఎసీలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.

ఇండోర్ వాయు కాలుష్యాల సోర్సెస్‌ గురించి అవగాహన కల్పించడం, దానిని తగ్గించడానికి మార్గాలను కనుగొనడం ప్రాజెక్ట్ దీర్ఘకాలిక లక్ష్యం అని బృందం తెలిపింది. వాయు కాలుష్య కారకాలు తరచుగా చికాకు కలిగిస్తాయని, తీవ్రమైన సందర్భాల్లో రోగులలో శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయని పల్మనాలజిస్టులు చెబుతున్నారు
Published by:Mahesh
First published:

Tags: Ahmedabad, Air Pollution, IIT, Plastic Ban

తదుపరి వార్తలు